కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై బదిలీ వేటు పడింది. గత కొంతకాలంగా మంత్రి గంగుల కమలాకర్ కు, కలెక్టర్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. ఎన్నికల సమయంలో బీజేపీ ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ తో కలెక్టర్ సర్ఫరాజ్ మాట్లాడిన ఆడియో టేపులు కలకలం రేపాయి. అయితే దీనిపై సర్పరాజ్ ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చుకున్నారు. కావాలని కొందరు కలెక్టర్ పైన, తనపైన బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అయితే చివరకు కలెక్టర్ సర్ఫరాజ్ ను కరీంనగర్ నుంచి బదిలీ చేసింది. కరీంనగర్ కు చెందిన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కలెక్టర్ పై ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కొత్త కలెక్టర్ గా శశాంక్ ను నియమిస్తారని తెలుస్తోంది.

 

గతంలో  కరీంనగర్ కలెక్టర్ సర్ఫ్ రాజ్ అహ్మద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషిని కలుసుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్ తనపై చేసిన ఆరోపణల మీద ఆయన సీఎస్ కు వివరణ ఇచ్చుకున్నారు. గంగుల కమలాకర్ ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించి తనకు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు మధ్య జరిగిన సంభాషణ ఆడియో బయటకు రావడం, దానిపై గంగుల ఆగ్రహం వ్యక్తం చేయడంతో కలెక్టర్ సీఎస్ ను కలిసి వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో తన ఓటమికి ఎంపీ బండి సంజయ్, కలెక్టర్ కలిసి కుట్ర చేశారని ఆరోపించిన గంగుల కమలాకర్ ఈ విషయమై అతను ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

 

గతంలో కూడా చాలా గంగుల కమలాకర్ చాలా మందిపై విమర్శలు సంధించారు. ఆయనపై చాలా మంది అనేక ఆరోపణలు కూడా చేశారు. ఉనికి కోసమే పొన్నం ప్రభాకర్‌ టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌, కేటీఆర్‌, ఎంపీపై విమర్శలు చేస్తే ప్రజలు తాను పోటీలో ఉన్నట్లు గుర్తిస్తారని ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. ఆదివారం సాయంత్రం స్థానిక మీసేవా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గతంలో ఐదుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ 2023 వరకు వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశారు.

 

టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, ఎంపీ వినోద్‌కుమార్‌పై చేసిన వాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం ఇటువంటి వాదోపవాదాల మధ్య కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై బదిలీ వేటు పడింది. గత కొంతకాలంగా మంత్రి గంగుల కమలాకర్ కు, కలెక్టర్ కు మధ్య విభేదాలు తలెత్తుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక రాను రాను ఎటువంటి పరిణామాలు వాటిల్లుతాయోనని కరీంనగర్ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: