ఇప్పటి వరకు కలసి ఉన్న ఎస్సీ,ఎస్టీ కమీషన్ ఇప్పటి నుంచి ఎస్సీ కమీషన్, ఎస్టీ కమీషన్ రెండిటినీ సపరేట్ చేస్తూ చట్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికీ, ముఖ్యమంత్రి గారికీ కృతజ్ఞతలు అన్నారు జోగి రమేష్. ఎస్సీ, ఎస్టీలు తెలుగుదేశం ప్రభుత్వంలో వృద్ధి చెందారని ప్రతిపక్ష సభ్యులు అంటున్నారు. స్వాతంత్రం వచ్చాక ఎందరో ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు పని చేసారు. ఎన్నడూ లేనట్టుగా ఎస్టీ అభ్యర్థి లేని క్యాబినెట్ చంద్రబాబు నాయుడు నడిపారు అని తెలిపారు. మంత్రి వర్గంలో ఎస్టీలు లేకుండా ఐదేళ్లు మీరు పాలన చేసి, ఎస్సీ ఎస్టీలను ఉద్ధరించానని ఈ సభ సాక్షిగా చెప్పడం సిగ్గుచేటు అని ఏదేవా చేసారు.

 

సాక్ష్యాత్తు నాటి ముఖ్యమంత్రి దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని నీచంగా మాట్లాడాడు అని గుర్తు చేసారు. అలాంటి మీరు ఎస్సీలు, ఎస్టీల గురించి మాట్లాడే అర్హతలేదు. నిజంగా టీడీపీ ఎస్టీలకు మేలు చేసింది నిజమే అయితే ఒక్క సీటైనా గెలిచుండేవారుగా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు నేడు చట్టసభలో ఉన్నారు. మేము పోరాటాలు చేస్తే కాదు, మా అంతరాత్మ, మా మదిలో ఉన్న ఆలోచనలు, మా అభిలాష, మేం పడుతున్న కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ తెలుసుకుని, మా వర్గాల ప్రజల ఉన్నతి కోసం నేడు చేస్తున్న చట్టాలివి.

 

50% రిజర్వేషన్ నామినేటెడ్ పదవుల్లో కల్పించమని మా వర్గాలెవ్వరం వైయస్ జగన్‌ను అడగలేదు. ముఖ్యమంత్రి గారే స్వయంగా 3648 కి.మీ పాదయాత్రలో ప్రతి గ్రామం తిరుగుతూ, ప్రతి వర్గాన్నీ, కులాన్నీ, మతాన్ని వాళ్ల బాధలు కష్టాలు ఏంటని తెలుసుకుంటూ, రాజకీయంగా, ఆర్థికంగా పడుతున్న బాధలు తెలుసుకుని ఇప్పుడు ఈ చట్టాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్నారు.

 


కృష్ణా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లల్లో ఇతర దేశాల్లో ఊరికి ఒకరుంటే గొప్ప. అదే అగ్ర వర్ణాల పిల్లలు ఇంటికొకరు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో  ఉంటారు. ఆ అసమానతలు తొలగించి, ఈరోజు మా పిల్లలను కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే మా పిల్లలు కూడా విదేశాలకు వెళ్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: