హమ్మనియమ్మ.. ఒక్క దెబ్బతో అప్పుల్లో కూరుకుపోయిన ఒక రైతు కోటీశ్వరుడయ్యాడు. చెప్పుకోదగ్గ విషయమే. వాస్తవానికి, ఉల్లి ధర పెరిగింది బాబోయ్ అంటూ సామాన్య ప్రజలు అంతా గగ్గోలు పెడుతుంటే.. ఒక రైతు మాత్రం మిక్కిలి సంతోషిస్తాడు. సామాన్య ప్రజల బాధను చూసి కాదులెండి.. కేవలం అతను వేసిన ఉల్లి పంటకి వచ్చిన లాభం వలన. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా దొడ్డసిద్దవ్వనహళ్లికి  చెందిన మల్లికార్జున(42) ఈ ఏడాది  ఉల్లి పంట పండించాడు.'ధైర్యే సాహసే లక్ష్మి' ఈ మాటలను ఎప్పుడో చిన్నప్పుడు పాతాళభైరవిలో సినిమాలో విన్నాం.. అయితే మల్లికార్జున ఈ మాటలను తూచా తప్పకుండా ఆచరణలో పెట్టాడు. అందుకే తన దశ, దిశ ఒకేసారి ఒకే దెబ్బతో పూర్తిగా మారిపోయింది. నిజానికి ఒక పంట వేయడానికి ప్రతి రైతు అప్పులను తెచ్చుకుంటాడు. అదే తరహాలో మన మల్లికార్జున్ కూడా 15 లక్షల రూపాయలను అప్పు తెచ్చి పది ఎకరాల కవుల భూమిలో ఉల్లి పంట వేశాడు. అయితే అంతకు ముందు అతను చాలా అప్పుల్లో కూరుకుపోయాడు. రిస్క్ చేసి పంట వేస్తే పెట్టుబడి పోనూ రూ.5-10 మిగులుతాయి అనుకున్నాడు.. లేకపోతే అకాల వర్షాల కారణంగా పంట నష్టం వస్తే అనుభవమైన వస్తుంది అనుకున్నాడు మల్లికార్జున్. ఏదైతే అదయింది, చివరికి ముందడుగు వేశాడు. ఆ రిస్కీ స్టెప్పే అతన్ని కోటీశ్వరుడిని చేసింది.

అంతా సానుకూల పరిస్థితులవల్ల అతనికి 2400 క్వింటాళ్లు (20 లారీల లోడ్లు)పంట దిగుబడికి వచ్చింది. అదే సమయంలో ఉల్లి ధరలు విపరీతమైన స్థాయిలో ఉన్నాయి. దాంతో మల్లికార్జున్ కు అతని పంట నిజంగానే పడినట్లయింది. మొదటిలో క్వింటాల్​ ఉల్లిపాయలను ఏడు వేల రూపాయలకు అమ్మిన మల్లికార్జున్... ఆ తర్వాత క్వింటాల్​ ఉల్లిపాయలను 12 వేల రూపాయలకు అమ్మి రూ.2 కోట్ల 88 లక్షలు సంపాదించాడు. పెట్టుబడి డబ్బులు, గతంలో చేసిన అప్పులన్నీ  పోనూ  ఇంకా చాలా డబ్బు మిగిలింది. దాంతో అతడు సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మల్లికార్జున్ మాట్లాడుతూ ఇల్లు కట్టుకుంటానని, కొంత డబ్బులు దాచి పెట్టుకుంటానని, పొలం కొనుకుంటున్నాని చెప్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: