రోజురోజుకి మానవ సంబంధాలు దిగజారుతున్నాయి. సమాజంలో బ్రతుకుతున్నామా అడవిలో బ్రతుకుతున్నామా అనే సందేశం కలుగుతోంది ఇలాంటి ఘటనలు వింటుంటే. ఒక మైనర్ బాలికను ఒక యువకుడు ప్రేమించాడు ఆమెను ఒక దుర్మార్గుడు అత్యాచారం చేయగా బాసటగా ఉండాల్సిన ప్రియుడు ఆమెను అవమానించడమే కాకుండా దారుణంగా చంపేశాడు. ఈ విషాదకర ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని టీ.నరసాపురం గ్రామంలో జరిగింది. 

 

వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మైనర్ బాలిక (14 సంవత్సరాల వయసు) అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో ప్రేమలో పడింది వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉండగా తొమ్మిదో తరగతి చదివే ఈ బాలిక కొద్ది రోజుల క్రితం ఒక ఆలయంలో భజన కార్యక్రమానికి హాజరు అయ్యి తిరిగి వస్తోంది. ఈ నేపథ్యంలో బాలిక ఒంటరిగా వస్తున్న విషయం గమనించిన అదే గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఎవరితో చెప్పుకోవాలో అర్ధంకాక తన ప్రియుడితో తనకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోదలచింది. 

 

ప్రియుడు దగ్గరకు వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పింది తనను ఓదార్చి బాసటగా నిలుస్తాడు అనుకుంటే "ఛీ నీ శీలం పోయింది, నువ్వు చెడిపోయావు, నువ్వు బ్రతికి లాభం లేదు, చచ్చిపో" అంటూ ఆత్మహత్యకు ప్రేరేపించాడు. అంతే కాకుండా ఈ దుర్మార్గుడు దగ్గర ఉండి మరీ ఆ బాలికకు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి ఆమెతో తాగించి హత్య కు పాల్పడ్డాడు. ఇలాంటి దుర్మార్గులను చూస్తుంటే సమాజంలో బ్రతుకుతున్నట్లు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ చట్టం కింద కేసు నమోదు చేసి ఈ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారికి ఉరి శిక్ష వేస్తేనే బుద్ధి వస్తుందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: