తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళకు కోసం కేసుల సత్వర విచారణకు దిశ బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి అందరికి తెలిసిందే కదా. దీనికి సంబంధించి ఏపీ అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం కూడా తెలియచేయడం జరిగింది. ఈ ఆమోదంతో  దేశవ్యాప్తంగా  ఈ బిల్లుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో వైపు జగన్ సర్కార్‌పై మహిళా సంఘాలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అంటే నమ్మండి. ఒక్క ఆంధ్రాలోనే కాదు  మిగిలిన రాష్ట్రాల్లోనూ ఈ బిల్లును తీసుకురావాలనే డిమాండ్ రావడం జరిగింది.. కొన్ని రాష్ట్రాలు ఈ బిల్లుపై ఆసక్తి కూడా ఉన్నట్లు సమాచారం.

 

తాజాగా దిశ బిల్లుపై ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆరా తీయడం జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఈ బిల్లుకు సంబంధించి పూర్తి వివరాలు మాకు ఇవ్వాలి అని కోరడం జరిగింది. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీలో కూడా తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన దిశ బిల్లుపై ఢిల్లీ ప్రభుత్వం ప్రశంసలు వర్షం  కురిపించిందని.. ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను అభినందించారు అలాగే . బిల్లు కాపీలు కావాలని తెలియచేయడం జరిగింది. తాను కూడా సీఎం, ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలను అభినందిస్తున్నానని స్పీకర్ తమ్మినేని తెలియచేయడం జరిగింది. 

 


ఇక జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం చాల వైరల్గా మారడం కూడా గమనిస్తున్నాము. ప్రతి పక్షం టీడీపీ కూడా బిల్లుకు మద్దతు తెలపగా.. బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ తమ్మనేని సీతారాం తెలియాచేయడం జరిగింది. ఇక ఈ బిల్లు ప్రకారం పక్కా ఆధారాలు ఉంటే.. అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి అవ్వడంతో పాటు . 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసి.. 21 రోజుల్లోనే  నిందితులకు శిక్షలు పాడే అవకాశాలు చాలా ఉన్నాయి. మహిళలు, చిన్నారులను కించపరుస్తూ.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని బిల్లును ఏర్పాటు చేయడం జరిగింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: