ఎన్నికలు వస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరు అనుకునే మాట బీజేపీ సర్కార్ పాక్ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది.  జాతీయ భద్రతా విధానం తీసుకొస్తోంది.  దాంతోనే అధికారంలోకి వస్తుందని అనుకుంటారు.  2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఇండియా పాక్ పై సర్జికల్ స్ట్రైక్ చేసింది. దీంతో ఆ దేశం షాక్ అయ్యింది.  ఈ స్ట్రైక్ తరువాత ఇండియా మరోసారి కూడా పాక్ పై సర్జికల్ స్ట్రైక్ చేసింది. 


మనదేశంలోకి చొరబడి ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తే చూస్తూ ఊరుకోబోమని, అందుకే ఇలాంటి స్ట్రైక్ చేస్తున్నామని బీజేపీ సర్కార్ గతంలో చెప్పిన సంగతితెలిసిందే.  అదే విధంగా చేసింది కూడా.  అయితే, ఆగష్టులో ఆర్టికల్ 370 రద్దు చేయడంలో కేంద్రం సక్సెస్ అయ్యింది.  దీంతో దేశంలో బీజేపీ పరపతి పెరిగింది.  కాంగ్రెస్ సహా చాలా పార్టీలు వ్యతిరేకించినా ఆ తరువాత సైలెంట్ అయ్యారు.  ఈ బిల్లు తరువాత కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొచ్చింది.  


ఈ బిల్లు ద్వారా పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుంచి వచ్చే ముస్లింలను కట్టడి చేయడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం.  పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా మొదట విదేశాల నుంచి వచ్చిన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పిస్తుంది.  అంటే, ముస్లింలకు పౌరసత్వం కల్పన ఉండదు.  క్యాబ్ బిల్లు పాస్ కావడంతో దేశంలో అల్లర్లు జరుగుతున్నాయి.  క్యాబ్ బిల్లును ఆమోదించి దేశాన్ని మరలా విభజిస్తున్నారని కాంగ్రెస్, తృణమూల్ వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.  


ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు మరో బిల్లు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది.  పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం తరువాత చెందిన వ్యక్తులను గుర్తించి వారిని వారి దేశాలకు పంపేందుకు ఎన్ ఆర్సి బిల్లు తీసుకురాబోతున్నది.  ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే... నాన్ ఇండియన్ ముస్లింలను గుర్తించి వారి దేశాలకు పంపించడమే.  ఈ ఎన్ ఆర్సిని ఇప్పటికే అస్సాంలో అమలు చేశారు.  19 లక్షల మందిని గుర్తించారు.  వీరందరూ పాక్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళుగా గుర్తించారు.  వారిని వారి వారి స్వాస్థలాలకు పంపించేందుకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.  వచ్చే ఏడాది ఈ ఎన్ ఆర్ సి బిల్లును ప్రవేశపెట్టి చట్టంగా తీసుకురావాలని చూస్తోంది.  ఎన్ ఆర్సి బిల్లు ఆమోదం పొందితే ఇక ఇండియా నుంచి నాన్ ఇండియన్ ముస్లింలు వారి దేశాలకు వెళ్లక తప్పదు.   

మరింత సమాచారం తెలుసుకోండి: