ఢిల్లీ హైకోర్టు ఉన్నావ్ ఘటనలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ ను దోషిగా ప్రకటించింది. బుధవారం రోజున హైకోర్టు ఈ కేసుకు సంబంధించిన శిక్షను ఖరారు చేయనుంది. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ 2017 సంవత్సరంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి మూడు రోజుల పాటు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ కేసులో సాక్ష్యాధారాలను సేకరించి సీబీఐ కోర్టుకు ఆధారాలను సమర్పించింది. 
 
కోర్టు చాలా రోజుల నుండి ఈ కేసుపై విచారణ జరిపి ఈరోజు తీర్పును ప్రకటించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో 9 రోజుల పాటు ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు సమాచారం. మైనర్ బాలిక కేసు నమోదు చేయాలని కోరినా పోలీసులు కేసు నమోదు చేయకుండా బాలికను వేధించారు. మైనర్ బాలిక తండ్రిపై అతను అక్రమాయుధాలు కలిగి ఉన్నాడని కేసులు పెట్టి వేధించారు. 
 
పోలీసు కస్టడీలోనే మైనర్ బాలిక తండ్రి మరణించారు. బాలికపై అత్యాచారయత్నం చేయటమే కాకుండా హత్య చేయటానికి ప్రయత్నాలు చేశారు. ఈ అంశాలను పరిశీలించిన తరువాత సీబీఐ సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుకు అందించగా కోర్టు ఈరోజు కొద్దిసేపటి క్రితం కుల్ దీప్ సింగ్ సెంగాల్ ను దోషిగా ప్రకటించింది. గతంలో కుల్ దీప్ సింగ్ సెంగాల్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 
 
నిందితునికి ఉరిశిక్ష వేయాలని ప్రజల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2017లో ఉన్నావ్ లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కేసులో ప్రధాన నిందితుడిగా కుల్ దీప్ సింగ్ సెంగర్ పేరును చేర్చారు. లక్నో కోర్టులో విచారణ జరుగుతున్న ఈ కేసును సుప్రీం ఆదేశాల మేరకు ఢిల్లీ కోర్టుకు బదిలీ చేశారు. జడ్జి ధర్మేశ్ శర్మ ఈరోజు తీర్పును వెలువరించారు. ఉత్తరప్రదేశ్ లోని బాంగర్ గావ్ నుండి నాలుగు సార్లు ఎంపికైన సెంగాల్ ను అత్యాచారం ఆరోపణలు రావడంతో బీజేపీ సస్పెండ్ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో బాధిత యువతికి సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ కల్పించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: