వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో ప్రతిపక్షాల పై తీవ్ర విమర్శలు చేస్తుందన్న  విషయం తెలిసిందే. ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర విమర్శలు చేసింది నగిరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... రాష్ట్రంలోని బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తామంటూ సంతకం కూడా చేశారని... కానీ ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు  దిగిపోయే సమయానికి కూడా రాష్ట్రంలో 43వేల బెల్టుషాపులు కొనసాగుతున్నాయని రోజా విమర్శించారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నారా వారి సారా పాలన కొనసాగింది ఆమె కౌంటర్ ఇచ్చారు. మద్యం రేట్లు పెరిగాయి అని ప్రభుత్వాన్ని తప్పుబట్టడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది  అంటూ ఆమె విమర్శించారు. 

 

 

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే... ఆ తర్వాత ఎన్టీఆర్  వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు మద్యం నిషేధాన్ని రద్దు చేశారని... ఇలాంటి ఘనత ఒక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కే దక్కుతుంది అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని టిడిపి ఎమ్మెల్యేలు అందరూ ఒక పులిహోర బ్యాచ్ అని .. కానీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పులి అంటూ నగరి ఎమ్మెల్యే రోజా కొరియాడారు . టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్టు ఇప్పుడు వెన్నుపోటు పొడవడానికి ఇక్కడున్నది ఎన్టీఆర్ కాదని  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నది చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. 

 

 

 

 మహిళలందరూ ఎంతో పవిత్రంగా భావించే పసుపు కుంకుమను  కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారని ఆమె ఆరోపించారు. కానీ రాష్ట్ర మహిళలందరూ చంద్రబాబుకు కోసి కారం పెట్టినంత పని చేశారని ఆమె విమర్శించారు. కేవలం ఇరవై మూడు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు అంటూ రోజా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ లో మద్యం అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు.. సమాధానం చెప్పుకోవడానికి ముఖంలేకనే  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు అని రోజా తీవ్ర విమర్శలు చేశారు.అలాంటి చంద్రబాబు ఇప్పుడు మద్యం ధరలు పెరగడం పై వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం  శోచనీయమని అన్నారు నగిరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి: