ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో మొత్తం పనులను దగ్గరనుండి చూసుకునే వ్యక్తి విజయ సాయి రెడ్డి. వైసీపీ పార్టీలో వైఎస్ జగన్ తర్వాత నెంబర్ టూ గా చలామణి అయ్యే విజయసాయిరెడ్డి కులం చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు ఇందు మూలంగానే జగన్ తన పక్కన విజయసాయిరెడ్డిని పెట్టుకుంటారు అని చాలామంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు మరియు అదేవిధంగా వివిధ పార్టీల మీడియా అధిపతులు కామెంట్లు చేస్తుంటారు. అటువంటిది విజయ సాయి రెడ్డి ఇటీవల తాను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అంటూ ఓపెన్ గా విజయ సాయి రెడ్డి మాట్లాడటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరియు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖుల లో కలకలం రేపింది. విషయంలోకి వెళితే ఇటీవల కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ పట్టణం లో ఉన్న కాపు వనభోజనాలకు విజయసాయి రెడ్డి ని తీసుకు వెళ్లడం జరిగింది. సాధారణంగా  కుల భోజనాలకు వేరే ఇతర సామజిక వర్గాల నాయకులూ ఎవరు హాజరు కారు.

 

అయితే ఈ వన భోజనాలకు వైసిపీ కీలక నేత విజయసాయిరెడ్డి హాజరవ్వడమే సంచలనం రేపింది.కొంతమంది కాపు సామజిక వర్గానికి చెందిన యువకుల్లో అసహనం బయటపడింది. దీంతో విజయసాయిరెడ్డి పై మరియు తీసుకువచ్చిన వంటి శ్రీనివాస్ పై వ్యతిరేకమైన నినాదాలు చేయడంతో దీంతో స్టేజిపై ఉన్న విజయసాయిరెడ్డి వెంటనే మైక్ తీసుకొని తాను కూడా కాపు కులస్తుడు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తాను నెల్లూరు జిల్లా వ్యక్తినని, అక్కడ రెడ్లను కాపులుగానే పిలుస్తారంటూ చెప్పారు.అవసరమైతే తన పదో తరగతి సర్టిఫికెట్లు పరిశీలించుకోవాలంటూ సవాల్ విసిరారు. దీంతో ఈ తతంగం మొత్తం అయిపోయిన తర్వాత ఈ విషయం జగన్ దాక వెళ్ళటంతో అదే సందర్భంలో విజయసాయిరెడ్డిని జగన్ అభినందించినట్లు సమాచారం.

 

మంచి మాట చెప్పారు మనం మన ప్రభుత్వం కులానికి మతానికి ప్రాంతానికి అదేవిధంగా రాజకీయాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా పని చేస్తుంది ఎటువంటి కుల ముద్ర మనపై పడకుండా అద్భుతమైన పరిపాలన అందిస్తున్న ఈ సమయంలో అందరూ సమానం అన్నట్టు గా మీరు మాట్లాడటం చాలా మంచి పరిణామమని ఎవరు ఏ కులం అయితే మనకేంటి మన పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చింది నన్ను ముఖ్యమంత్రిని చేసింది ఆంధ్ర ప్రజలు అని కులాలతో మనకు సంబంధం అవసరం లేదు కులాలకు అతీతంగా వైసీపీ పార్టీ దూసుకుపోవాలని ముందు నుంచి ఇదే నా ఆశ సరైన సమయంలో మీరు సరిగ్గా మాట్లాడారు అంటూ విజయసాయిరెడ్డిని జగన్ పొగిడినట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: