తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పౌరసత్వ సవరణ చట్టంపై రాజధాని ఢిల్లీలో  గందరగోళాలు ఏర్పడ్డాయి. చిన్నపాటి వర్సిటీ విద్యార్థుల నుంచి ప్రజాసంఘాలు, విపక్ష నేతల ధర్నాలు, ఆందోళనలు బాగా చేస్తూ ఉన్నాయి. ఇక ఈ ఆందోళనలను  నివారించేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌, టియర్‌ గ్యాస్‌ ప్రయోగలు చేస్తున్నారు. మరో వైపు పోలీసులు, ఉద్యమకారులకు మధ్య తీవ్ర ఘర్ణణలు బాగా ఏర్పడాయి.

 

ఈ తరుణంలో రాజధానిలోని తాజా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో చర్చించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సిద్ధం అయ్యినట్లు వార్తలు వస్తున్నాయి. కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా చేసుకొని తాజా పరిస్థితిపై తన భావన వ్యక్తం చేయడం జరిగింది. ఇక వర్సిటీ విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారడం చాల బాధాకరం అని,  నిరసన మరో వైపుకు పోకుండా శాంతియుతంగా మెలగాల్సిన అవసరం వచ్చింది అని తెలిపారు కేజ్రీవాల్‌ . ఈ మేరకు అమిత్‌ షాను  అపాయింట్‌మెంట్‌  కేజ్రీవాల్‌ కోరడం జరిగింది.

 

అమిత్‌ షా ప్రస్తుతం  జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో .. ఢిల్లీ వచ్చిన అనంతరం కేజ్రీవాల్‌తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. భేటీలో ముఖ్యంగా ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులుపై చర్చలు జరపాలని అనుకున్నారు. ఇది ఇలా ఉండగా ఆగ్నేయ ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీలో ఆందోళనకారులు పలు బస్సులను తగలబెట్టడంతో హింసాత్మకంగా మారిన విషయం చాల బాధాకరం. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనాలను కూడా విద్యార్థులు ధ్వంసం చేయడం జరిగింది. పోలీసుల లాఠీ చార్జిలో పలువురు విద్యార్థులు, ఆందోళనకారులకు కూడా చికిత్స కూడా పొందుతున్నారు. 

 

ఐతే మరో వైపు  తాము ఎన్‌ఎస్‌యూఐ  సంస్థ మాత్రం మేము  శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని తెలియచేయడం జరిగింది. ఉద్యమంలో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు చేరి హింసకు పాల్పడుతున్నాయని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులు అరోపణలు చేస్తున్నారు. ఇక తాజా ఘటనపై స్పందిస్తూ  ప్రధాని మోదీ సహా, పలువురు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: