సోమవారం 6వ రోజు ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి..., వైసీపీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశంలో తమ గళాన్ని ఎత్తారు.


ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ సీఎం జగన్ ను బాగా కొనియాడారు. జగన్ మోహన్ రెడ్డి పాలన పండుగ వాతావరణాన్ని తలపిస్తుందన్నారు. జగన్ ఆదివాసీ గిరిజనులందరికీ నేనున్నానంటూ ఎంతో అండగా ఉన్నారని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. జగన్ లాంటి గొప్ప నాయకుడిని తాను ఎక్కడ చూడలేదంటూ.. తనకి కృతజ్ఞతలు చెప్పారు.



పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి  ఘన విజయం సాధించారన్న విషయం విదితమే. అయితే, ఆమె నియోజకవర్గంలో సీఎం జగన్ గిరిజన మెడికల్ కాలేజీ ను ఏర్పాటు చేశాడు. ఆదివాసుల దినోత్సవం సందర్భంగా 300 కోట్ల రూపాయల వరాలను కూడా గిరిజనుల కోసం ప్రకటించారు. ఈ విధంగా ఆదివాసుల కోసం ఎంతో మేలు చేసిన జగన్ మోహన్ రెడ్డిని కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి  ఆరవ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో మెచ్చుకున్నారు.




ఇకపోతే టిడిపి మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మద్యపాన సమస్యల గురించి మాట్లాడుతూ... 'ఇంతకు ముందున్న మద్యం బ్రాండ్ లు.. ఇప్పుడు లేవు అధ్యక్షా' అనే సరికి సభ్యులంతా పకపకా నవ్వారు. దాంతో.. స్పీకర్ తమ్మినేని సీతారాం.. 'ఆ మందు బ్రాండుల విషయాలు నీకెందుకమ్మా' అన్నారు. అప్పుడు ఆది రెడ్డి భవాని కూడా చిరునవ్వు నవ్వారు. కానీ ఆది రెడ్డి భవాని ఏం మాట్లాడిన చివరికి చంద్రబాబు మీదకు విమర్శలు వస్తున్నాయి. మొన్న ఆ మధ్య అసెంబ్లీ సమావేశంలో 'పప్పు ధరలు బాగా పెరిగాయి, అధ్యక్షా' అని అనగానే... కొడాలి నాని, మీరు ఏ పప్పు గురించి మాట్లాడుతున్నారని కామెంట్ చేసి చంద్రబాబు కొడుకుని టార్గెట్ చేసారు. ఈ రోజేమో మందు బ్రాండ్ ల గురించి ఆదిరెడ్డి భవాని ప్రస్తావిస్తుంటే.. 'ఆ బ్రాండ్ విషయాలు ఆయనకు బాగా తెలుసు.. ఆయన మాట్లాడతారులే' అని స్పీకర్ చంద్రబాబు ని టార్గెట్ చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: