వైకాపా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది.  నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న వైకాపా... మద్యం పై ఎక్కువగా దృష్టి పెట్టింది.  మద్యం సేవించడం వలనే దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించింది.  అందుకే రాష్ట్రంలో మద్యం నిషేధాన్ని దశలవారీగా తగ్గిస్తూ వస్తున్నది.  ఇప్పటికే మద్యం దుకాణాలను ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకొని ప్రభుత్వమే నిర్వహిస్తోంది.  


మద్యం దుకాణాల సమయాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకొచ్చి ఆ సమయంలో మాత్రమే మద్యం అమ్మకాలు జరిగేలా చూస్తున్నది.  ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతాయి.  అంతేకాదు, మద్యం ధరలను భారీగా పెంచడంతో ప్రజలు మద్యం కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.  
గతంలో కంటే రేట్లు దాదాపుగా 40శాతం పెరిగాయి.  అంతేకాదు పర్మిట్ రూమ్ లు కూడా తీసేశారు.  దీంతో మందుబాబులు ఎక్కువ మద్యం కొనుగోలు చేయలేకపోతున్నారు.  క్రమంగా మద్యం అమ్మకాలను తగ్గించాలని ప్రభుత్వం ఆలోచన.  మద్యం అమ్మకాల విషయంలో అసెంబ్లీలో చర్చ జరిగింది.  ఆ సమయంలో టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మద్యం అమ్మకాలపై మాట్లాడేందుకు సిద్ధం అయ్యింది.  


మద్యం షాపుల్లో పనిచేసేవాళ్లు బయట మద్యం అమ్మకాలు చేస్తున్నారని.. బెల్ట్‌ షాపులకు మద్యం వెళుతోందన్నారు. యువతకు మంచి కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఇలా వైన్ షాపుల్లో ఉద్యోగాలు ఇవ్వడం సరికాదని అన్నారు. అక్కడితో ఆగక గతంలో లిక్కర్ బ్రాండ్స్‌ చాలా ఉండేవని...ఇప్పుడు తగ్గిపోయాయని భవానీ చెప్పగానే స్పీకర్‌ సహా సభ్యులందరూ నవ్వుకున్నారు. ఆ బ్రాండ్‌ల గురించి నీకెందుకు తల్లి వేరే వాళ్లు మాట్లాడతారు అంటూ స్పీకర్ నవ్వుతూ సలహా ఇచ్చారు. పాపం వైకాపా మద్యం అమ్మకాలపై విరుచుకుపడాలని చూసి, మాట్లాడే విధానంలో తడబడి బ్రాండ్ల గురించి మాట్లాడి టీడీపీ పరువును అసెంబ్లీ సాక్షిగా తీసేసింది.  అసలే తెలుగుదేశం, వైకాపా మధ్య మద్యం విషయంలో పెద్ద యుద్ధమే జరుగుతున్నది.  ఈ సమయంలో భవాని మాట్లాడైన మాటలను వైకాపా నేతలు ట్రోల్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: