ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు మొదలు అయ్యాయి.. సోమవారం మొదలు అయిన అసెంబ్లీ సమావేశాలు వాడి వేడి గా జరిగాయని చెప్పొచ్చు.. ఇరు పార్టీ వర్గ నేతల మధ్య మాట మాట యుద్ధo బాగానే జరిగింది.. ఈరోజు అసెంబ్లీలో లో మద్యపానం నిషేధం గూర్చి చర్చ జరిగింది..

 

అందులో భాగంగా వైస్సార్ సీపీ పార్టీ 'ఎమ్మెల్యే రోజా' మాట్లాడుతూ జగన్ గారి పాలనలో మద్యం అక్రమాలు తగ్గాయని, సిఎం జగన్ గారు దశల వారీగా మద్యపాన నిషేధం ని అమలు చేస్తున్నారని తెలిపారు... "నారా వారి పాలనలో సారాయి జోరుగా ఊపందుకుంది" అని విమర్శించారు. ఈ మద్యం వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని తెలిపారు.

 

వైస్సార్ పాలనలో మంచి రోజులు వచ్చాయి అని, ఎన్ని కష్టాలు పెట్టిన, ఎన్ని కేసులు పెట్టిన నవ్వుతూ ఉన్నారేగాని వెనుదిరగని గొప్ప నాయకుడు సిఎం జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు ఎమ్మెల్యే రోజా.. ఆరు దశల్లోనే మద్యపానo నిషేదించిన ఘనత సిఎం గారిది అని తెలిపారు. ప్రతి మహిళ. . ...ముఖ్యమంత్రి గారిని అభినందిస్తుందని తెలిపారు.

 


సభాపర్వం లో సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ "చంద్రబాబు హయం లో మొత్తం 4380 మద్యం షాపులు ఉండేవి.. వాటిని 3456 కి తగ్గించాం " ఈ ఘనత ఒక్క వైస్సార్ సీపీ పార్టీ కె దక్కింది.. దశలవారీగా మొత్తం 924 మధ్య షాపుల అమ్మకాలని తగ్గించామని తెలిపారు..అచ్చె న్నాయుడు పై" ప్రివిలేజ్ మోషన్ యాక్ట్ "అమలుచేస్తామని తెలిపారు.

 

అంతేకాకుండా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చేన్నాయుడు పై సభా హక్కుల నోటీసులు ఇస్తాము అని, సభను తప్పు దోవ పట్టుస్తున్నారని జగన్ తెలిపారు... నాటు సారాపై సమాచారం ఉంటే ఎందుకు ఇవ్వడం లేదని అంబటి వాపోయారు...

 


అంతకు ముందు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని అనర్దాలకి కారణం మందు అని, మానవ మనుగడ అనేది మందు వల్ల నాశనం అవుతుందని, జీవితాలు సర్వనాశనం చేసేది మందు అని తెలిపారు.. తెలుగు దేశం పార్టీ హయాంలో మందు విక్రయాలు బాగా సాగాయని తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: