ఇడ్లీ.. ఉదయం టిఫిన్ గా తీసుకుంటాం.. కొన్ని కొన్ని సార్లు ఆరోగ్యం బాగోకపోతే రాత్రి పూటా కూడా తింటాం. అలాంటి ఆరోగ్యవంతమైన ఈ ఇడ్లీ వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇడ్లీని ఇలా తీసుకోవడం వల్ల బరువు కూడా త్వరగా తగ్గుతారు. అంతే కాదు ఈ ఇడ్లీ తినటం వల్ల ఎంతో ఆరోగ్యంగా తయారవుతారు. ఇందులో నూనె ఉండదు కాబట్టి బరువు కూడా పెరగారు. 

                         

అలాంటి ఈ ఆరోగ్యవంతమైన ఇడ్లీని మనం ఇంట్లో నిత్యం చేస్తుంటాము. ఒకొక్కసారి ఎక్కువగా కూడా చేస్తాము. ఆలా వేస్ట్ చేసే బదులు.. ఇడ్లీతో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. అయితే అది ఎలా చేయాలో చాలామందికి తెలియదు. అలాంటి వారు ఈ ఇడ్లీ ఫ్రైని ఎలా చేస్తారు అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. మీ ఇంట్లోను ఇడ్లీ ఫ్రై ని ట్రై చెయ్యండి.  

                      

కావలసిన పదార్థాలు.. 

 

ఇడ్లీలు - ఐదు, 

 

ఛాట్‌ మసాలా - ఒక టేబుల్‌ స్పూన్‌, 

 

ఉప్పు - తగినంత, 

 

నూనె - ఫ్రైకి సరిపడా.


 
తయారీ విధానం... 

 

ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఇడ్లీలను వేసి గోధుమరంగు వచ్చే వరకు వేగించాలి. వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఛాట్‌ మసాలా చల్లుకోవాలి. అంతే ఇడ్లీ ఫ్రై రెడీ ఐపోతుంది. ఆ తర్వాత ఆ ఇడ్లీ ఫ్రైని కొబ్బరి చట్నీతో గానీ, టొమాటో సాస్‌తో గానీ వేడి వేడిగా సర్వ్‌ చేస్తే సరిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: