నందమూరి బాలకృష్ణ పరిచయం అవసరం లేని పేరిది. ఎన్టీయార్ కొడుకు, ప్రముఖ సినీనటుడు, చంద్రబాబునాయుడు బావమరది కమ్ వియ్యింకుడుగా బాలయ్య బాబు చాలా పాపులర్. ఇన్ని భుజకీర్తులన్న బాలకృష్ణలో మరోకోణం కూడా ఉంది. అదేమిటంటే రాజకీయనేత కూడా. అనంతపురం జిల్లాలోని  హిందుపురం నియోజకవర్గంలో వరుసగా రెండోసారి ఎంఎల్ఏగా గెలిచారు.

 

మిగితా విషయాలు ఎలాగున్నా ఎంఎల్ఏగా మాత్రం బాలయ్య ఫెయిలనే చెప్పాలి. పార్టీ అధికారంలో ఉన్నపుడే ఐదేళ్ళు నియోజకవర్గాన్ని గాలికొదిలేశారు. అదే పద్దతిలో ప్రతిపక్షంలో ఉన్నపుడు కంటిన్యు చేస్తున్నారు. ఈ విషయం ఇపుడు స్పష్టంగా కనిపిస్తోంది.  అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎంత హాటు హాటుగా జరుగుతున్నాయో అందరూ చూస్తున్నదే. ఇటువంటి సమయంలో బావయ్య చంద్రబాబుకు అండగా ఉండాల్సిన బావమరది బాలయ్య అడ్రస్సే కనబడటం లేదు.

 

విషయం ఏదైనా కానీండి చంద్రబాబును అధికారపార్టీ సభ్యులు దుమ్ము దులిపేస్తున్నారు. పార్టీ తరపున గెలిచిందే 23 మంది ఎంఎల్ఏలు.  అందులో యాక్టివ్ గా ఉంటున్నది కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే. మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నట్లు ? ఈ ప్రశ్న మిగిలిన వాళ్ళకన్నా ముందు బాలయ్యకే ఎక్కువ తగులుతుంది. ఎందుకంటే బాలకృష్ణ ఉత్త ఎంఎల్ఏ మాత్రమే కాదు చంద్రబాబుకు బావమరిది కమ్ వియ్యంకుడు కూడా.  అలాంటి బాలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పెద్దగా కనబడటం లేదు.

 

కష్టాల్లో ఉన్న బావకు బావమరిదే అండగా నిలబడకపోతే మిగిలిన ఎంఎల్ఏలను అనుకుని ఉపయోగమేంటి ? అనే చర్చ పార్టీలోనే జరుగుతోంది. శీతాకాల సమావేశాల్లో ఏదో ఒకటి రెండు రోజులు మాత్రమే అసెంబ్లీకి వచ్చామంటే వచ్చామనిపించుకున్న బాలయ్య తర్వాత అడ్రస్సే లేరు. అసెంబ్లీలో జరుగుతున్న చర్చల్లో కానీ లేకపోతే రచ్చలో కానీ తనవంతు బాధ్యతగా చంద్రబాబుకు అండగా నిలవాలి కదా ?  స్వయాన తన బావమరిదే అసెంబ్లీకి హాజరుకాకపోతే  ఇక మిగిలిన సభ్యులను చంద్రబాబు ఏమని అడగ్గలరు ? మొత్తానికి బావనే బావమరిది బాగా ఇరుకునపెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: