అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చాలా హాట్ హాట్ గా సాగుతూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు తీవ్ర స్థాయిలో పేలుతున్నాయి. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు 14 కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఆర్టీసీ విలీనం మరియు ఇంకా అనేక కీలకమైన బిల్లులు అసెంబ్లీలో ఆమోదముద్ర పొందడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు తప్పుదోవ పట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ముఖ్యంగా అచ్చెన్నాయుడు దారుణంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పచ్చి అబద్ధాలు ఆడుతూ అసెంబ్లీ సమావేశాలను చూస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు అంటూ సీఎం జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

అసెంబ్లీలో మాట్లాడుతూ…టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సభను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మద్యం పాలసీపై అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలన్నీ తప్పని అన్నారు. ఆయన చెప్పిన లెక్కలు తప్పని తేలితే అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా? అని సీఎం జగన్ సవాల్ విసిరారు. టీడీపీ నేతలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అచ్చెన్నాయుడుపై సభాహక్కుల నోటీసును ఇస్తామన్నారు.

 

అంతకుముందు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ , మద్యం షాపులను తగ్గిస్తాని చెప్పిన ప్రభుత్వం.. ఆ మాట తప్పిందని, అంతేకాకుండా రాష్ట్రంలో నాటు సారా అమ్మకాలు ఎక్కువయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు . ప్రభుత్వం చెబుతున్నదానికి విరుద్ధంగా రాష్ట్రంలో మద్యం షాపుల సంఖ్య పెరిగిందని ఆరోపించారు. ఇంకా అనేక విషయాల గురించి ప్రతి సారి చంద్రబాబు మరియు ఆయన పార్టీ నేతలు ఇలానే వ్యవహరిస్తున్నారని పేదలకు మంచి పనులు చేస్తే వీళ్ల కడుపు రగిలి పోతోందని ఎప్పుడు పేదలు మరియు దళితుల జీవితాలతో రాజకీయం చేసే ఇలాంటి నాయకులు ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు సిగ్గుపడాలి అంటూ తీవ్ర స్థాయిలో జగన్ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: