జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన నాటి నుండి జగన్ ని టార్గెట్ గా చేసుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు ప్రవర్తిస్తున్న తీరును బట్టి చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ పొలిటికల్ లీడర్ లు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కి మద్దతు తెలిపి టీడీపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. అటువంటి సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రతిపక్షపార్టీ నేతగా ఉన్న వైఎస్ జగన్ పోరాడుతున్న తరుణంలో … పవన్ కళ్యాణ్ పక్షంలో ఉన్న వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తూ అధికార పార్టీ చంద్రబాబు పార్టీ ని డిఫెండ్ చేస్తూ వచ్చేవాళ్ళు.

 

2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒకే ఒక స్థానాన్ని దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే పార్టీ వ్యవస్థాపకుడిగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ని టార్గెట్ గా చేసుకుని చాలా దారుణమైన విమర్శలు కుల మత ప్రాంత మరియు భాష ఇలా అనేక రకాలుగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంటే మరోపక్క ఆ పార్టీలో ఉన్న గెలిచిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న మంచి పనులను అసెంబ్లీలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసించారు. ఎస్సి కమిషన్ ను రెండుగా విబజించి మాల, మాదిగ కమిషన్ లుగా ప్రభుత్వం చేయడాన్ని ఆయన అభినందించారు జగన్ నిర్ణయం చారిత్రాత్మకం అని , ఈ నిర్ణయంతో దళితులు అభివృద్ధి చెందుతారన్నారు.

 

జగన్‌ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నామని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు చాలా దారుణమన్నారు. కొన్ని ప్రాంతాల్లో కుల వివక్షత తీవ్రంగా ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు సమాజంలో సమాన స్థానం కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని వరప్రసాద్ పేర్కొన్నారు. మొత్తం మీద పవన్ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీలో జగన్ భజన చేసే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: