2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుకు ఏది కలిసి రావడం లేదు. ఓ వైపు నేతలు పార్టీని వీడిపోతుంటే...మరోవైపు ప్రతిపక్షంగా వారు చేసే పోరాటాలని ప్రజలు నమ్మడం లేదు. సరే ఇవి పక్కనబెడితే అసెంబ్లీ లో అయినా అధికార పక్షాన్ని నిలదీద్దామనుకుంటే అక్కడ కూడా బాబుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైసీపీ వాళ్ళు ఆయన్ని నోరు ఎత్తనివ్వడం లేదు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా బాబుకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

 

జగన్ ప్రభుత్వం ఎస్సీ..ఎస్టీ కమిషన్ ను..ఇక నుండి వేర్వేరుగా ఎస్సీ కమిషన్..ఎస్టీ కమిషన్ గా మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో..కొద్దోగొప్పో ఇప్పటివరకు మద్దతిస్తున్న ఎస్సీ,ఎస్టీ సామాజికవర్గం టీడీపీకి మరింత దూరమయ్యే ప్రమాదం వచ్చింది. అసలు మామూలుగానే ఎస్సీ, ఎస్టీ ఓటర్లు వైసీపీ వైపు ఎక్కువ ఉంటారు. ఈ విషయం మొన్న ఎన్నికల్లో స్పష్టంగా అర్ధమైంది. రాష్ట్రంలో 36 రిజర్వ్ సీట్లు ఉంటె అందులో టీడీపీ ఒక్క కొండపి సీటు మాత్రమే గెలుచుకుంది.

 

ఇక దీని బట్టి చూస్కుంటే ఎస్సీ, ఎస్టీలు ఎవరికు ఎక్కువ మద్దతిస్తున్నారో అర్ధమైపోతుంది. అయితే ఇప్పుడు ఎస్సీ,ఎస్టీ వారికి ప్రత్యేకంగా కమిషన్లు తీసుకు రావడం వల్ల...వైసీపీకి చాలా అడ్వాంటేజ్ కానుంది. ఇక దెబ్బ తో కొద్దోగొప్పో టీడీపీకి మద్దతు తెలిపేవారు ఇప్పుడు దూరమయ్యే అవకాశముంది. పైగా ఈ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్న సందర్భంలో జగన్...గత టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీలకు ఎలా అన్యాయం జరిగింది..తమ హయాం లో వారికి ఏ విధంగా న్యాయం చేస్తున్నామో పూర్తిగా వివరించారు.

 

పైగా గతంలో దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు అన్న మాటలని అసెంబ్లీ సాక్షిగా జగన్ మరోసారి గుర్తు చేసారు.  అసలు చంద్రబాబు ప్రతీ విషయంలోనూ దళితులు..బీసీలు..మైనార్టీల పట్ల వివక్ష చూపించారని,  ఓట్ల కోసం కులాలే కాదు..అన్న దమ్ములను చీల్చేస్తారని ఓ రేంజ్ లో మండిపడ్డారు. ఈ విధంగా చంద్రబాబుకు జరగాల్సిన డ్యామేజ్ గట్టిగా జరిగిపోయింది. ఈ దెబ్బ తో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయిపోయింది చంద్రబాబు పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: