అసెంబ్లీ సమావేశాల ఆరో రోజు మద్యంపై హాటు హాటు చర్చలే జరిగాయి.  అర్ధంపర్ధం లేని ఆరోపణలతో  విమర్శలతో తెలుగుదేశంపార్టీ సభ్యులు ఏదో గోల చేయాలని అనుకుంటే వైసిపి తరపున మంత్రి కొడాలి నాని, సభ్యురాలు రోజా దుమ్ము దులిపేశారు. అ సమయంలో సభలో చంద్రబాబునాయుడు లేడు కాబట్టి సరిపోయింది. ఉండుంటేనా ఇంతకన్నా అవమానం మరోటుండదనే అనుకోవాల్సుండేది.

 

నిజానికి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. ఊరు ఊరులోను బెల్టుషాపులను ఏర్పాటు చేసి చాలా ఇళ్ళను చంద్రబాబు ప్రభుత్వం గుల్ల చేసేసింది. మద్యం షాపులను పెంచేసి, బార్ అండ్ రెస్టారెంట్లను పెంచేయటమే కాకుండా వాటికి అదనంగా సుమారు 43 వేల బెల్టుషాపులను ప్రోత్సహించింది. పనిలో పనిగా ఎక్సైజ్ ఆదాయం పెంచుకునేందుకు ఏకంగా అధికారులను పెట్టి  మద్యాన్ని అమ్మించింది చంద్రబాబు ప్రభుత్వం.

 

సరే ఇదే విషయంలో తాను అధికారంలోకి వస్తే మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తానని హామీ ఇచ్చుడు. మధ్య, దిగువ తరగతి జనాలు మద్యం తాగాలంటేనే షాకు కొట్టేంతగా ధరలను పెంచేస్తానంటూ పాదయాత్ర సందర్భంగానే చెప్పాడు. అధికారంలోకి రాగానే ముందుగా చెప్పినట్లే చేస్తున్నాడు. దీన్నే చంద్రబాబు బ్యాచ్ తట్టుకోలేకపోతోంది.

 

ఇదే విషయమై రోజా మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు పెరుగుతుంటే గోల చేసే ప్రతిపక్షాలను చూశాం కానీ మద్యం ధరలు పెంపుపై గోల చేస్తున్న ప్రతిపక్షం టిడిపి మాత్రమే అంటూ సెటైర్లు వేశారు.  ఇచ్చిన హామీని అమలు చేస్తు జగన్మోహన్ రెడ్డి మాత్రమే నిజమైన పులని, హామీలను తుంగలో తొక్కే వాళ్ళంతా పులిహోర బ్యాచే అంటూ జాడించేశారు.

 

ఇసుక ధరలు పెరిగుతున్నాయని ఇసుక సంచులను, ఉల్లిధరలు పెరుగుతుంటే ఉల్లిపాయల ధండలను మెడలో వేసుకున్న చంద్రబాబు బ్యాచ్ మద్యం ధరలు పెరుగుతున్నయని మద్యం బాటిళ్ళను మెడలో వేసుకుని వస్తాడేమోనని భయపడినట్లు ఎద్దేవా చేశారు.  మొత్తానికి మద్యంపై టిడిపి పాలనపై రోజా ఒంటికాలిపై విరుచుకుపడింది. నిజానికి ఆ సమయంలో చంద్రబాబు సహలో లేరు కాబట్టి సరిపోయింది. ఉండుంటే ఎంత అవమానంగా ఫీలయ్యేవారో  ?

మరింత సమాచారం తెలుసుకోండి: