రాజోలు  ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు ఏ పార్టీ కొనసాగుతున్నారన్నది సస్పెన్స్ గా మారింది . ఇటీవల జరిగిన ఎన్నికల్లో  జనసేన తరుపున రాపాక వరప్రసాద్ రావు ఒక్కరే విజయం సాధించిన విషయం తెల్సిందే . అయితే రాపాక మాత్రం  అసెంబ్లీ లో  పార్టీ లైన్ కు భిన్నంగా వ్యవహరిస్తుండడం పరిశీలిస్తే,  అయన జనసేన లో కొనసాగుతున్నారా? లేకపోతే అధికార పార్టీ కి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారా?? అన్న అనుమానం రాకమానదు .

 

 ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యం ప్రవేశపెట్టే అంశం పై జరిగిన చర్చలో పాల్గొన్న రాపాక , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని అభినందిస్తూ , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు . ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల  మాద్యం ఆవశ్యకతను వివరిస్తూ ,  అసెంబ్లీ టీడీపీ అనుసరిస్తున్న తీరు పట్ల   రాపాక  పరోక్షంగా విమర్శలు గుప్పించడం పరిశీలిస్తే, అయన త్వరలోనే అధికార పార్టీలో చేరనున్నారన్న ఊహాగానాలు విన్పించాయి . అయితే రాపాక మాత్రం తాను జనసేనను వీడాలని భావించడం లేదంటూనే , అసెంబ్లీ వేదికగా  మరొకసారి పార్టీ  పార్టీ నాయకత్వానికి షాక్ ఇచ్చారు .

 

 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎస్సి, ఎస్టీ లకు వేర్వేరుగా కమిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది . ఈ అంశం పై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న రాపాక , మరొకసారి జగన్మోహన్ రెడ్డి ని ఆకాశానికెత్తారు . ముఖ్యమంత్రి నిర్ణయం చరిత్రాత్మకమని ప్రశంసించారు . తాను  ఎటువంటి అభ్యంతరం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ  నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాని పేర్కొన్నారు . ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద దళితులు, గిరిజనులు అభివృద్ధి చెందుతారన్న  రాపాక వైఖరి  పరిశీలిస్తే , అయన జనసేనలో కొనసాగుతూనే వైస్సార్ కాంగ్రెస్ అనుబంధ సభ్యుడినన్నట్లు వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: