జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ వలన కొత్త పెన్షన్ లబ్ధిదారు కుటుంబం 15 వేల రూపాయలు నష్టపోయిందని ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చాక మాట మార్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ ప్రతి కొత్త పెన్షన్ లబ్ధిదారు కుటుంబాన్ని నిలువునా ముంచేశారని పవన్ కళ్యాణ్  ఆరోపించారు.  ఎన్నికలకు ముందు వైసీపీ పెన్షన్ 2 వేల రూపాయల నుండి 3 వేల రూపాయలకు పెంచుతామని చెప్పిందని పవన్ కళ్యాణ్ అన్నారు.
 
పెన్షన్ పెంపుతో పాటు పెన్షన్ అర్హత వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గిస్తామని చెప్పిందని అన్నారు. కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ ను 2,000 రూపాయల నుండి 2,250 రూపాయలకు మాత్రమే పెంచారని పవన్ అన్నారు. ప్రభుత్వం కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచటం వలన ఒక్కో లబ్ధిదారుడు 750 రూపాయలు నష్టపోతున్నాడని పవన్ కళ్యాణ్ అన్నారు.
 
2019 మే నెల 30వ తేదీన పెన్షన్ అర్హత వయస్సును 65సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో తెచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అర్హత వయస్సును తగ్గించటం వలన కొత్తగా పది లక్షల మందికి పెన్షన్ దక్కాల్సి ఉందని కానీ ఇప్పటివరకు ఒక్కరికి కూడా అదనంగా పెన్షన్ దక్కలేదని పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 2,250 రూపాయల లెక్క ప్రకారం చూసినా జగన్ వలన కొత్త లబ్ధిదారు కుటుంబం 15,750 రూపాయలు కోల్పోయిందని చెప్పారు. 
 
జగన్ ప్రభుత్వం మాట తప్పుతోంది అనాలా...? మోసం చేస్తోంది అనుకోవాలా..? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కానీ వైసీపీ ప్రభుత్వం గతంలోనే పెన్షన్ ను విడతల వారీగా పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని స్పష్టత ఇచ్చింది. నవశకం సర్వే పూర్తయిన తరువాత కొత్త పెన్షన్ లబ్ధిదారులకు అర్హత కార్డులను మంజూరు చేయటంతో పాటు ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయనుంది. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో చేసిన ట్వీట్లపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: