దిశఘటన నవంబర్ 27 వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే.  ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  అయితే, దిశ ఘటన జరగడానికి ముందు రోజు నగరంలోనే మరో దారుణమైన ఘటన జరిగింది.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఆరోజు సాయంత్రం మూసి నది ఒడ్డున ముగ్గురు దుండగులు ఓ 19 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేశారు.  


ఏం జరిగిందో ఆమెకు తెలియదు.  చెప్పలేని  స్థితి.  పరిస్థితిని సైగల ద్వారా వివరించింది.  ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్లు ఖలీమ్, అజీజ్, నజీర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే,  మతి స్థితిమితం లేని యువతి తన తల్లితో కలిసి కులసుంపురలో ఉంటోంది.  మతి స్థితిమితం సరిగా ఉండకపోవడంతో తరచుగా బయటకు వెళ్తుండేది.  


అలా వెళ్లిన ప్రతిసారి ఆమె సోదరులు వెతికి తీసుకొస్తుండేవారు.  అలానే ఈనెల 26 వ తేదీన బయటకు వెళ్ళింది.  అలా వెళ్లిన యువతిపై ఆటో డ్రైవర్లు ఖలీమ్, అజీజ్ లు కన్నేశారు.  ఆ యువతిని మూసి ఒడ్డుకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు.  అనంతరం నజీర్ కు అప్పగించి వెళ్లిపోయారు.  నజీర్ కూడా ఆమెపై అత్యాచారం చేసి వదిలేసి వెళ్ళిపోయాడు.  దీంతో ఆ యువతి అక్కడే ఉండిపోయింది.  


ఆమెకోసం వెతుకుతుండగా మూసి దగ్గర కన్పించింది.  అయితే, తనపై ఎవరో ఏదో చేసినట్టుగా సైగల ద్వారా చెప్పడంతో పోలీసులు మానసిక వైద్యులను పిలిపించారు.  విషయం బయటపడింది.  సిసిటీవీ ఫుటేజ్ ల ఆధారంగా మొదట నజీర్ ను పట్టుకున్నారు.  ఆ తరువాత ఆటో డ్రైవర్ ఖలీమ్, అజీజ్ లను పట్టుకున్నారు.  మానసిక స్థితి సరిగా లేని యువతిపై జరిగిన ఈ అమానుషం నిజంగా హేయం అని చెప్పాలి.  అమ్మాయి కనిపిస్తే ఇంతలా రెచ్చిపోతున్నారు మృగాళ్లు.  ప్రసుత్తం వీరిని రిమాండ్ కు పంపించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: