దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు డిసెంబర్ 6 వ తేదీన ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులు మరణించారు.  నలుగురు మరణించిన రోజు సాయంత్రమే ఖననం చేయాలని అనుకున్నారు.  కానీ, కుదరలేదు.  హైకోర్టు ఆదేశాలతో ఖననం ఆగిపోయింది.  దీంతో మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీకి అక్కడి నుంచి గాంధీ మార్చురీకి తరలించారు.  


అయితే, డిసెంబర్ 13 వరకు మాత్రమే మృతదేహాలను భదరపరచాలని అనుకున్నా, ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో ఉన్నది కాబట్టి అక్కడి నుంచి ఆదేశాలు వచ్చే వరకు మృతదేహాలను భద్రపరచాలి.  మృతదేహాలను ఎంత ఫ్రీజింగ్ లో భదరపరిచినా కొంత ఇబ్బందిగా ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఎందుకంటే, ఎంత ఫ్రీజింగ్ చేసినా మృతదేశాలు కుళ్లిపోతూనే ఉన్నాయి.  వాటిని భద్రపరచడం తమ వాళ్ళ కాదని అంటున్నారు గాంధీ సిబ్బంది.  


ఇంజెక్షన్, ఎంబాబింగ్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని, ఎంబాబింగ్ చేస్తే వారం వరకు భద్రపరచవచ్చు అని, అయితే రి పోస్టుమార్టం చేయడానికి వీలు కాదని అంటున్నారు.  తమ దగ్గర అధునాతనమైన ఫ్రీజింగ్ టెక్నాలజీ లేదని, ఢిల్లీకి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని గాంధీ సిబ్బంది కోరే అవకాశం ఉన్నది.  ఢిల్లీలోని ఎయిమ్స్ లో దీనికి సంబంధించిన టెక్నాలజీ ఉన్నది.  అక్కడైతే అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది.  


ఎన్నిరోజులైనా ఫ్రీజింగ్ చేసుకునే సౌకర్యం ఉన్నది.  కానీ, గాంధీలో ఆ సౌకర్యాలు లేవు.  దీంతో అక్కడి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  మరి దీనికి ప్రభుత్వం అంగీకరిస్తుందా చూడాలి.  ఎప్పటి వరకు మృతదేహాలను ఇలా భద్రపరచాలి తెలియదు.  ఎప్పుడు ఈ కేసుకు సంబంధించిన తీర్పు వస్తుందో తెలియదు.  వాటిని డి కంపోజ్ కాకుండా ఎలా చూడాలో తెలియక పాపం సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.  మరి చూద్దాం ఏం జరుగుతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: