లోకంలో మనం పెద్దల నోటి నుండి అప్పుడప్పుడు పాపం చేసిన వాడు కుక్క చావు చస్తాడు అనే మాటలు తరచుగా వింటుంటాం. ఆ మాట ఎందుకంటారో ఇప్పుడు దిశ నిందితులను చూస్తే అర్ధం అవుతుంది. కుక్క చచ్చిపోతే తాడు కట్టి ఈడ్చుకెళ్లి ఎక్కడో ఒకచోట పడేస్తారు. అక్కడ దాని శరీరం కుళ్ళీ  పురుగులు పట్టి మట్టిలో కలిసిపోతుంది. ఇది జంతువుల చావు. ఇక మనుషులు మరణిస్తే సాంప్రదాయబద్దంగా కర్మ ఖాండలు నిర్వహిస్తారు కానీ ఇప్పటి వరకు ఇలాంటి వాటికి కూడా నోచుకోకుండా దిశ నిందితుల శవాలు అనాధ శవాలుగా కుళ్లుతున్న స్దితిలో మార్చూరిలో ఉన్నాయి.

 

 

ఇకపోతే చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని, వాటిని ఏం చేయాలో చెప్పాలని కోరుతూ ప్రభుత్వ ప్లీడర్‌కి లేఖ రాసేందుకు గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నెల 7న ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మహ్మద్‌ అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతదేహాలను సుప్రీంకోర్టు విచారణ నేపథ్యం లో ఈనెల 13 వరకు గాంధీ మార్చురీలో భద్రపరచాలని హైకోర్టు సూచించింది. దీంతో మృతదేహాలను గాంధీ మార్చురీకి తీసుకొచ్చి ఫ్రీజర్‌ బాక్స్‌లో భద్రపరిచారు.

 

 

అయితే ఫ్రీజర్‌ బాక్సుల్లో పెట్టిన మృతదేహాలు వారం రోజుల తర్వాత క్రమంగా కుళ్లిపోతాయి. ఎంబామింగ్‌ చేసి ఫార్మల్‌ డీహైడ్‌ ద్రావకాన్ని రక్తనాళాల ద్వారా మృతదేహాల్లోకి ఎక్కిస్తే పాడవకుండా ఉంటాయి. దీంతో మృతదేహాలకు ఎంబామింగ్‌ చేయాలని ఫోరెన్సిక్‌ వైద్యులు నిర్ణయించారు. అయితే ఎంబామింగ్‌ చేస్తే మృతదేహాలకు రీపోస్టుమార్టం చేసేందుకు అవకాశం ఉండకపోవడం, మరోపక్క మృతదేహాలు కుళ్లిపోవడం ప్రారంభమయ్యే దశకు చేరుకోవడంతో ఫోరెన్సిక్‌ వైద్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు.

 

 

ఇకపోతే ఈ నెల 13 వరకు మృతదేహాలను భద్రపరచమని కోర్టు ఆదేశాలు జారీ చేసియగా ఆ గడువు ముగిసింది కనుక మృతదేహాలను ఏం చేయాలో చెప్పాలని మంగళవారం జీపీకి లేఖ రాయనున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: