సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2007లో విజయవాడలోని దుర్గా హాస్టల్ లో బి ఫార్మసీ చదువుతున్న అయేషా మీరా అనే విద్యార్థినిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు.  ఈ కేసులో నిందితులు ఎవరూ అనే విషయం అందరికి తెలిసినా విషయం బయటకు రాలేదు.  సత్యం బాబు అనే ఓ వ్యక్తిని అనవసరంగా ఇరికించారు.  సత్యం బాబు నిర్దోషి అని హైకోర్టు 2008 లో విడుదల చేసింది.  అనంతరం ఈ కేసును సిబిఐకి అప్పగించింది.  


సిబిఐ రంగంలోకి దిగి తనదైన శైలిలో కేసు విచారణ చేస్తున్నది.  ఈ కేసుకు సంబంధించిన చాలా ఆధారాలు కోర్టులో ద్వాంసం కావడంతో తిరిగి విచారణ జరపడం కష్టమే అయినా... సిబిఐ చాకచక్యంతో కేసును కదిలించింది.  అయేషా మీరా డెడ్ బాడీని రీ పోస్ట్ మార్టం నిర్వహించారు.  ఈ కేసు విషయంలో అయేషా మీరా తల్లి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.  ఈ కేసును మాఫీ చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆమె చెప్పడం విశేషం. 


రాజశేఖర్ రెడ్డి హయాంలోనే హత్య జరిగింది.  నిందితుల పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని, రాజకీయంగా పలుకుబడి ఉండటంతో ఈ కేసులో నిందితులను బయటకు రాకుండా చూశారని అన్నారు.  ఇప్పుడు జగన్ దిశ పేరిట కొత్త చట్టం తీసుకొచ్చారు.  ఇప్పుడైనా అసలైన నిందితులను పెట్టుకుంటారని అనుకోవడం లేదని అన్నారు.  రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు కావడంతో వారిని పట్టుకోరని మరలా ఎవరి మీదకు కేసు నెట్టేస్తారని అంటున్నారు.  


అయితే, సిబిఐకి అప్పగించారు కాబట్టి ఈ కేసును తప్పనిసరిగా పరిష్కరిస్తారని అంటున్నారు.  కేసు పరిస్కారం జరుగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది.  దిశ చట్టం కిందనే ఈ కేసును తీసుకొస్తే... 21 రోజుల్లోగా పరిష్కరించాలి.  అలా చేసేందుకు సీబీఐ ఒప్పుకుంటుందా చూద్దాం.  ఆధారాలు సేకరించకుండా సీబీఐ ఈ కేసును దిశ కేసుగా ద్రువీకరిస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉన్నది.  మరి చూద్దాం ఏం జరుగుతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: