తాజాగా ఆయన మాటలు వింటుంటే అందరిలోను ’స్ల్పిట్ పర్సనాలిటి’  రోగ లక్షణాలు పెరిగిపోతున్నాయనే అనుమానం పెరిగిపోతోంది. ’ఏపి దిశ యాక్ట్-2019 ప్రకారం బాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతోంది’ ? అంటూ జగన్మోహన్ రెడ్డిని నిలదీయటమే విచిత్రంగా ఉంది.  ఆ చట్టం తర్వాత అత్యాచారాలు జరుగుతుంటే ఒక్క కేసు అయినా నమోదు చేశారా ? అంటూ ప్రశ్నించేశారు.  చట్టం తర్వాత కూడా అత్యాచారాలు పెరుగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తోంది ? అని కూడా నిలదీసేశారు. తనలో రోగ లక్షణాలు ముదిరిపోతుంటే జగన్ కు ఆపాదించటమే ఆశ్చర్యంగా ఉంది.

 

విచిత్రమేమిటంటే దిశ చట్టం ఏర్పడింది కేవలం రెండు రోజుల క్రితమే అన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, హత్యాచారాలను నియంత్రించటానికే ఈ చట్టం వచ్చింది. చట్టాలు ఉన్నంత మాత్రాన అత్యాచారాలు, హత్యాచారాలు జరగవన్న గ్యారెంటి ఎవరు ఇవ్వలేరన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిశచట్టాన్ని తెచ్చింది.

 

చట్టం పక్కాగా అమలైతే అప్పుడు అత్యాచారాలు, హత్యాచారాలు తగ్గుతాయన్నది ప్రభుత్వం ఆలోచన. వాస్తవం ఇదైతే  గుంటూరు జిల్లాలో జరిగిన ఓ ఘటనకు దిశచట్టం అమలుకు చంద్రబాబు ముడిపెట్టేసి జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు. బాధితురాలిని పరామార్శించలేదని జగన్ పై  చంద్రబాబు మండిపోవటమే విచిత్రంగా ఉంది. తాను వెళ్ళి పరామర్శించటంలో తప్పు లేదు కానీ ఇతరులు పరామర్శించలేదని గోల  చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 

రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట ఏదో ఓ ఘటన జరుగుతునే ఉంటుంది. అంతమాత్రాన ప్రతి ఘటనను నేరుగా ముఖ్యమంత్రికే ముడేసేయటం చంద్రబాబులోని అపరిచితుడిని గుర్తుచేస్తోంది.  చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, హత్యాచారాలు జరగనే లేదన్నట్లుగా మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది.

 

జగన్ పై వ్యక్తిగతంగా తనకున్న కసిని చంద్రబాబు ఏదో  ఓ రూపంలో తీర్చుకునేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు. దానికి ఎల్లోమీడియా కూడా వత్తాసు పలుకుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఉన్నపుడు ఇలా చేస్తేనే జనాలు బాగా బుద్ధి చెప్పారు. అయినా చంద్రబాబులో జ్ఞానోదయం కలగకపోవటమే విచిత్రంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: