అత్యాచారాల బాధితుల విషయంలో కూడా సామాజికవర్గాల కోణాన్ని చూడటం ఒక్క చంద్రబాబునాయుడుకి మాత్రమే చెల్లుతుందేమో ?  ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తన భుజాన్ని తానే చరుచుకునే చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలే ఆయన మనఃస్ధితికి అద్దం పడుతోంది.  గుంటూరు జిల్లాలో ఓ చిన్నపిల్లపై అత్యాచారం జరిగింది. బాధితురాలు చికిత్స చేయించుకుంటున్న గుంటూరు ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ తర్వాత చేసిన వ్యాఖ్యలతోనే కంపరం మొదలైంది.

 

మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో జరిగిన దశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ పై కేసియార్ ను తెగపొగిడిన జగన్మోహన్ రెడ్డి గుంటూరు ఘటనపై ఎందుకు స్పందించటం లేదంటూ నిలదీయటమే విడ్డూరంగా ఉంది. బాధితురాలు దళితురాలు కాబట్టే జగన్ స్పందించటం లేదని చంద్రబాబు తేల్చేశారు. అత్యాచారం జరిపిన యువకుడు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వాడు కావటం వల్లే జగన్ స్పందించటం లేదన్నట్లుగా జగన్ పై విషం చిమ్మేశారు.

 

మహిళలు, బాలికలపై హత్యాచారం, అత్యచారాలను నిరోధించటానికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపి దిశ యాక్ట్-2019 తెచ్చింది. అసెంబ్లీలో చట్టం పాసై రెండు రోజులే అయ్యింది. అసెంబ్లీ పాసైన చట్టాన్ని గవర్నర్ ఆమోదం పొందాలి. చట్టంలో సిఆర్పిసి, ఐపిసి చట్టాల  సవరణలకు కేంద్రం ఆమోదం రావాలి. తర్వాత చట్టం అమల్లోకి వచ్చినట్లవుతుంది. ఈ విషయం చంద్రబాబుకు తెలిసి ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు.

 

బాధితురాలు దళితురాలు కాబట్టే జగన్ పట్టించుకోవటం లేదనే ఆరోపణల వెనుక  కుట్ర కోణమే కనిపిస్తోంది. జగన్ కు వ్యతిరేకంగా దళితులను రెచ్చగొట్టే కుట్ర మాత్రమే చంద్రబాబు మాటల్లో  కనిపిస్తోంది.  లేకపోతే బాధితురాలికి, అత్యాచారానికి పాల్పడిన వాళ్ళ విషయంలో కూడా సామాజికవర్గ కోణం చంద్రబాబు తప్ప మరెవరైనా చూడగలుగుతారా ?  అత్యాచారాలు చేయటానికి దళిత, బలహీన వర్గాల అమ్మాయిలే దొరికారా ? అని అడగటంలో అర్ధమేంటి ?  తొందరలో జరగబోతున్న స్ధానిక సంస్ధల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఇంత నీచానికి దిగజారిపోతున్నట్లు అనుమానంగా ఉంది. ఇంకెతగా  దిగజారిపోతారో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: