గత దశాబ్దకాలంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి రాజకీయాల్లో  అంతగా కలిసి రావడం లేదు. ప్రజల నుంచి అన్ని చోట్ల ఛీత్కరింపులే ఎదురవుతున్నాయి. 2009 సంవత్సరంలో ఎన్టీఆర్ నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలోకి దింపాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న  ఫ్యాన్  ఫాలోయింగ్ ఉపయోగించుకుని... ఎన్టీఆర్ కున్న చరిస్మా ను  వాడుకుని ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రచార రంగంలోకి దిగి తనదైన శైలిలో ప్రచారం కూడా నిర్వహించారు. కానీ చంద్రబాబు నాయుడుకు ప్రజల్లో ఉన్న నెగిటివిటీ ఎన్టీఆర్ ప్రచారం చేసిన తగ్గలేదు దీంతో ఎన్నికల్లో  విజయం సాధించలేకపోయారు. 

 

 

 అయితే జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలు ఏర్పర్చుకున్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.ఇక  ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనసేన తో సంబంధాలు మరింత దగ్గరయ్యాయి. దీంతో వైయస్సార్సీపి పార్టీకి ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేము అని అనుకున్నారో ఏమో... బాబు మాస్టర్ మైండ్ ప్లాన్ వేసి జనసేన మద్దతు కూడగట్టుకున్నారు. ఏకంగా ఎన్టీఆర్ ను సైతం పక్కన పెట్టి.. జనసేనను బ్రతిమిలాడుకున్నారు బాబోరు. ఇక 2014 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు. ఇక తర్వాత ఏమైందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ టీడీపీ నుండి  బయటికి వచ్చేశారు. ఇక ఆ తర్వాత చంద్రబాబు ఎంతో నమ్మినప్పటికీ...  పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నిండా ముంచేసినట్లుగా టిడిపి పార్టీ నుంచి విభేదించారు. 

 

 

 క్రమక్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఈసారి కూడా మాస్టర్ ప్లాన్ వేశారు చంద్రబాబు.2019 ఎన్నికల్లో  కూడా   ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదు అనుకున్నాడో ఏమో.. మరో సారి జనసేన పొత్తు కోసం ప్రయత్నాలు చేశారు. కానీ 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు గట్టిగా దెబ్బసి  ఒంటరిగానే  పోటీ చేసింది.జనసేన  టిడిపి పార్టీలు తాజాగా జరిగిన 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశాయి. ఇంకేముంది అటు జనసేన పార్టీకి ఇటు  చంద్రబాబు టీడీపీ  పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. కేవలం ఇరవై మూడు సీట్లకే టీడీపీ పరిమితం చేయగా జనసేన కు మాత్రం ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే కట్టబెట్టారూ  ప్రజలు. దీంతో పవన్ కళ్యాణ్ బాబొరిని నిండా ముంచి తాను కూడా  నిండా మునిగి పోయినట్లు అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: