నందమూరి ఫ్యామిలీ లో ఎంతో మంది రాజకీయ నాయకులు ఎంతో మంది సినిమా హీరోలు ఉన్నప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం ఒక సపరేట్ క్రేజ్ ఉంటుంది. నందమూరి  ఫ్యామిలీ లో ఉన్నవారందరికీ ఉన్న క్రేజ్ ఒకఎత్తైతే .. కేవలం జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ఒక ఎత్తు. తాత సీనియర్ ఎన్టీఆర్ చరిష్మా తో  పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదిగారు. ఇక  జూనియర్ ఎన్టీఆర్ కు  వస్తున్న క్రేజ్ ని చూసి... బాబో రు ఓర్వ లేక పోయారు అన్నది అందరూ అనుకుంటున్న మాట. ఇక ఎన్టీఆర్ ను ఎలాగైనా తొక్కేయాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేయ్య డానికి బాబుతో కలిసి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఎన్నో కుట్రలు పన్నారు. 

 

 

 

 కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజల్లో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా... సీనియర్ ఎన్టీఆర్ చరిష్మా ఉన్న వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. దీంతో చంద్రబాబు నాయుడు,  బాలయ్యలోకేష్ ఎన్ని కుట్రలు చేసినా... జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేసేందుకు  ఎన్ని ప్రయత్నాలు చేసినా జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలను మాత్రం ఆపలేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్ కు 2011లోనే పెళ్లి చేసేసారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి తర్వాత తీసిన సినిమాలన్నిటికి  ఫ్లాఫ్ టాక్ తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కడానికి శతవిధాల ప్రయత్నాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి నందమూరి బాలకృష్ణ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడటం లాంటివి ఇందుకు నిదర్శనం. 

 

 

 

 ఇక ఎన్ని విధాలుగా కుట్రలు చేసినా జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలను ఆపలేక పోయాము  అని అనుకున్నారో ఏమో... చివరికి ఎన్టీఆర్ ఉన్న ఫాలోయింగ్ ని తన రాజకీయాలకు కోసమైనా  ఉపయోగించుకోవాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసారు. దీంతో 2009 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ ను  ప్రచారానికి వాడుకున్నారు. కానీ చంద్రబాబుకు  ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ముందు  జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కూడా ఉపయోగ పడలేదు.చంద్రబాబు కు పరాజయం ఎదురైంది. ఇక ఆ తర్వాత 2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సైతం పక్కన పెట్టేసి... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు కోసం బ్రతిమిలాడాడు చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు పనికిరారని ప్రజల అభిప్రాయ పడేలా చేశారు. కానీ చివరికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం పొందలేదు అన్న మాట ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: