మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను సంస్కరణలకు ఆద్యుడు అని చెప్పుకుంటారు.  అయితే దీన్ని వైసిపి నాయకులు పూర్తిగా వ్యతిరేకిస్తారు. చంద్రబాబుకు ప్రభుత్వాన్ని  నడపటం కంటే ప్రైవేటీకరణ అంటేనే చాలా ఇష్టమని  విమర్శిస్తుంటారు.  తాజాగా వైసీపీ ఎమ్మెల్యే  రవీంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు తీరును ఎండగట్టారు.

 

ఆయన ఏమన్నారంటే.. " ప్రైవేటేజేషన్ అంటే బాబుకు ముద్దు. 1994లోనే ప్రైవేటేజేషన్ ఎంత బాగా చేయొచ్చో ఆయనే స్వయంగా పుస్తకమే ప్రచురించారు. ఆ పుస్తకంలో తొలి పేజీలోనే దాదాపు 18 యూనిట్లను ప్రైవేటు పరం చేసినట్టు రాసుకున్నారు. ప్రభుత్వ సంస్థలను ఎలా మూతబెట్టాలో టార్గెట్ పెట్టుకుని మరీ చేసారు. ఆ టార్గెట్ ఎలా రీచ్ అయ్యారో ఈ పుస్తకంలో వివరంగా రాసారు. 

 

 

హనుమాన్ కోఆపరేటివ్ షుగర్ మిల్లు, ఎఎస్సెమ్ కోఆపరేటివ్ షుగర్ మిల్స్, ఆదిలాబాద్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్, రాజమండ్రి కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్, నిజాం షుగర్స్ లిమిటెడ్, చాగల్లు డిస్లినరీ, షక్కర్ నగర్ షుగర్ మిల్స్, షక్కర్ నగర్ డిస్లరీ, మూంబుజ్ పల్లీ షుగర్ మిల్, మెట్ పల్లి షుగర్ మిల్, మధురా నగర్ షుగర్ మిల్, మాంబోజీపల్లి డిస్లరీ, నంద్యాల కోఆపరేటివ్ షుగర్ మిల్, నాగార్జునా కోఆపరేటివ్ షుగర్ మిల్, పర్చూర్ స్పిన్నింగ్ మిల్..టార్గెట్ పెట్టుకున్న విధంగా ఫస్ట్ ఫేజ్‌ లోనే 18 యూనిట్లను ప్రైవేటు పరం చేసేసారు. నామినల్ రేట్లకు తమ బినామీలకు అమ్మేసారు.  

 

 

ఇక మూసేసినవైతే లెక్కేలేదు. ఏపీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవల్మెంట్ కార్పొరేషన్, ఆల్విన్ వాచెస్ లిమిటెడ్, నెల్లూరు కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, చీరాల కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, చిలకలూరిపేట కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్ ఇవన్నీ బాబుగారి పాలనలో మూతబడ్డాయి. ఇవే కాదు - ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హ్యాండీ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీటన్నిటినీ ఫేజ్ 1లో రీస్ట్రక్చర్ పేరుతో మూసేసారు.

 

 

ఇలాగే ఫేజ్ 2లో దాదాపుగా 68 టార్గెట్ పెట్టారు. వాటిలొ 15 వరకూ 2002-2003 కల్లా కంప్లీట్ చేయాలని అనుకున్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు ప్రముఖ పాత్ర వహిస్తారు తప్ప నిర్మించేది, అభివృద్ధి చేసేది చంద్రబాబు మనస్తత్వం కాదు. రైతు అనేవాడు పంట ఎలా పండించాలని ఆలోచన చేస్తాడు. దొంగలు ఎలా దోచుకోవాలా అనే ఆలోచిస్తారు. ఇలా బాబు పరిపాలన అంతా సాగింది." అన్నారు కమలాపురం ఎమ్మెల్యే.

మరింత సమాచారం తెలుసుకోండి: