చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఇడిబి) ఆధ్వర్యంలో రూ 1.39 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయా ?  అవుననే అంటోంది ఎల్లోమీడియా.  చంద్రబాబు హయాంలో ఉండగా లక్షల కోట్ల పెట్టుబడులు రావటమే కాకుండా సుమారు 1.5 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చినట్లు చెప్పేసింది.  నిజంగానే అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసి, లక్షలాదిమందికి ఉద్యోగాలు వచ్చేశాయా ? అంటే క్షేత్రస్ధాయిలో కనబడటం లేదే ?

 

లక్షల కోట్ల పెట్టుబడులంటూ జనాలకు అబద్ధాలు చెప్పటం, లక్షలాదిమందికి ఉద్యోగాలంటూ  భ్రమల్లో ముంచెత్తటం చంద్రబాబు, టిడిపి బాగా అలవాటు. ఇప్పుడిదంతా ఎందుకంటే చంద్రబాబు హయాంలో  ఇడిబికి సీఈవోగా జాస్తి కృష్ణ కిషోర్ పనిచేశారు. ఆయన్ను తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేసింది. సరే ఆయనపై చర్యలు తీసుకోవటం ఎంతవరకూ సబబు అంటే ఆ విషయం దర్యాప్తులో తేలుతుంది.

 

జాస్తిపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా గగ్గోలు పెట్టేస్తోంది. జాస్తికి మద్దతుగా ఎల్లోమీడియా ఓ కథనాన్ని అచ్చోసింది.  విశాఖపట్నంలో వరుసగా పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణ సదస్సు జరిగినపుడు ప్రభుత్వం సుమారు రూ. 110 కోట్లు ఖర్చు చేసింది. మూడు సదస్సుల ద్వారా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు ఎల్లోమీడియా చెప్పటమే విచిత్రంగా ఉంది. సుమారు 15 లక్షల కోట్ల రూపాయలకు ఎంవోయులు కుదుర్చుకున్నాయట.

 

పారిశ్రామికవేత్తల ముసుగులో  సదస్సుల్లో పాల్గొన్న వారిలో బోగస్ వాళ్ళున్నట్లు అప్పట్లోనే తేలిపోయింది. టిడిపి కార్యకర్తలకే సూటు, బూటు వేసేసి పారిశ్రామికవేత్తలుగా చంద్రబాబు ఫొటోలు దిగినట్లు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అందరికీ గుర్తుండే ఉంటుంది. పైగా ఎంవోయులు కుదిరినంత మాత్రానా పెట్టుబడులు వచ్చేస్తాయని గ్యారెంటీ లేదు.

 

వచ్చిన పెట్టుబుడల విషయంలో  అప్పటి కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు బదులిస్తు పెట్టుబడులు ఏమీ పెద్దగా రాలేదని పరిశ్రమల శాఖే స్వయంగా చెప్పింది.  కాబట్టి చంద్రబాబు హయాంలో జరిగిన సదస్సులు, ఎంవోయుల్లో అత్యధికం భోగస్సే అని తేలిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: