రాజకీయాలకు, సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంటుంది అనే సంగతి తెలిసిందే.  రాజకీయాల్లో ఐదేళ్లకు ఎన్నికలు జరుగుతాయి.  అధికారం అన్నది ఒక్కరిచేతిలోనే ఉండదు మారిపోతుంటుంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీని పంచన చేరి నాయకులను పొగడ్తలతో ముంచెత్తడం సినిమా నటీనటులకు వెన్నతో పెట్టిన విద్య.  ఎందుకంటే, ఎవరైతే అధికారంలో ఉంటారో వారిని తప్పని సరిగా పొగడాల్సిన పరిస్థితి ఉంటుంది.

 
ఎందుకంటే, సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన పనులు పొగడక తప్పదు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది.  కాంగ్రెస్ పార్టీని అప్పటిలో సినిమా ఇండస్ట్రీ ఆకాశానికి ఎత్తింది.  అయితే, రాష్ట్రం విడిపోయిన తరువాత తెలుగుదేశం పార్టీ 2014లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తే, తెలంగాణాలో తెరాస పార్టీ అధికారంలోకి వచ్చింది.  ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తరువాత టాలీవుడ్ పరిశ్రమ చంద్రబాబు నాయుడిని అనేకసార్లు కలిసి మాట్లాడారు.  


చంద్రబాబు నాయుడుని తెలుగు సినిమా పరిశ్రమ అనేకసార్లు కలిసి మాట్లాడింది.  అనేక సందర్భాల్లో అనేక విషయాలను గురించి చర్చించారు.  రాష్ట్రం డివైడ్ అయ్యాక సినిమా పరిశ్రమ హైదరాబాద్ లోనే ఉన్నది.  కానీ, చంద్రబాబును తెలుగు సినిమా పరిశ్రమ నిత్యం టచ్ లో ఉండటం వెనుక ఆంతర్యం ఏంటి అన్నది తెలియలేదు.  తెలుగు సినిమా పరిశ్రమను అమరావతికి తీసుకురావడానికి చాలా ట్రై చేశారు.  


తెలుగు సినిమా పరిశ్రమను అమరావతికి తరలించాలని, స్టూడియోలు నిర్మించుకోవడానికి అమరావతిలో అనువైన స్థలాలను కూడా బాబు కేటాయించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే.  ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ విశాఖలో స్టూడియోలను నిర్మించింది.  మరికొన్ని సంస్థలు కూడా విశాఖ పరిసర ప్రాంతాల్లో స్టూడియోలు నిర్మిస్తున్నాయి.  అయితే, 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని రోజులు తెలుగు సినిమా పరిశ్రమ దూరం దూరంగా ఉన్నది.  ఇటీవల కాలంలో జగన్ చేస్తున్న మంచి పనులను మెచ్చుకుంటూ టాలీవుడ్ పరిశ్రమ జగన్ కు దగ్గరవుతుండటం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: