ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని 1982వ సంవత్సరంలో సీనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. బీసీలకు, యువతకు పెద్ద సంఖ్యలో టికెట్లు ఇచ్చి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే పార్టీని ఎన్టీయార్ అధికారంలోకి తీసుకొనిరాగలిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీయార్ మొత్తం మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 
 
కానీ 1995వ సంవత్సరంలో చంద్రబాబు నాయకత్వంలో పార్టీలో తిరుగుబాటు జరగటంతో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ ను పార్టీ నుండి బయటకు పంపారు. సీనియర్ ఎన్టీయార్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన ఉదంతం గురించి ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ తరువాత పదవికి దూరం కావటం, ఎంతో నమ్మిన చంద్రబాబు, సొంత నాయకులే మోసం చేయటంతో మనోవేదనకు గురైన సీనియర్ ఎన్టీయార్ కొంతకాలానికి మృతి చెందారు. 
 
సీనియర్ ఎన్టీయార్ మృతి తరువాత చంద్రబాబు సీనియర్ ఎన్టీయార్ ను దైవాంశ సంభూతుడు అని పొగుడుతూ 1999 సంవత్సరంలో అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు పరిపాలన చూసిన ప్రజలు 2004 ఎన్నికల్లో టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 47 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆ తరువాత అధికారంలోకి రావాలని 2009 ఎన్నికల్లో సీనియర్ ఎన్టీయార్ మనవడు, టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీయార్ ను చంద్రబాబు టీడీపీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు. 
 
ఎన్నికల ప్రచారం సమయంలో జూనియర్ ఎన్టీయార్ కారుకు యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఎన్టీయార్ తీవ్రంగా గాయపడ్డారు. పార్టీ కోసం జూనియర్ ఎంతో కష్టపడినప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత చంద్రబాబు జూనియర్ ను దూరం పెడుతూ వచ్చాడు. తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీయార్ కు ప్రాముఖ్యత ఇస్తే తన కొడుకు లోకేశ్ రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదమనే ఉద్దేశంతో చంద్రబాబు ఎన్టీయార్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతూ వచ్చారు. ఒక దశలో జూనియర్ ఎన్టీయార్ సినీ రంగంలో కూడా ఎదగకుండా జూనియర్ సినిమాలు రిలీజైన రోజే సినిమా ఫ్లాప్ అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నెగిటివ్ ప్రచారం చేశారు. 
 
2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే సాధించిందంటే ప్రజల్లో తెలుగుదేశం పాలన పట్ల ఎంత వ్యతిరేకత ఉందో సులభంగానే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, టీడీపీ వీరాభిమానులు, కార్యకర్తలు, నేతలు తెలుగుదేశం పార్టీకి ఏపీలో భవిష్యత్తు ఉండాలంటే జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావాలని సీనియర్ ఎన్టీయార్ కు ద్రోహం చేసి పార్టీని చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబుకు జూనియర్ దెబ్బ పడాల్సిందేనని చంద్రబాబును టీడీపీకి దూరం చేసి జూనియర్ పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: