ఎప్పుడైతే వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందో అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు మరియు ఇంకా చాలామంది పార్టీలకు చెందిన అధ్యక్షులు రెచ్చిపోయారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అత్యంత దారుణమైన దయనీయమైన స్థితిలో ఉంది. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు అధికార పార్టీని కాంగ్రెస్ పార్టీని దించడానికి వేరే ఇతర పార్టీలతో చేతులు కలపాలని ప్రయత్నించారు కానీ అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ... కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అప్పట్లో నిలబడింది. అయితే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగడం మిగిలి ఉన్న 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నిక అవ్వడం జరిగింది.

 

అయితే ఎప్పుడైతే 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి చంద్రబాబు రావడం జరిగిందో అప్పటినుండి చంద్రబాబు కార్పొరేట్ రాజకీయం మొదలు పెట్టారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి విషయంలో చదువులో మరియు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ల విషయంలో ఇలా అనేక విషయాలలో కార్పొరేట్ రాజకీయాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా చంద్రబాబు కార్పోరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ వ్యవహరించారు అని విపక్ష పార్టీలు కామెంట్లు చేస్తూ ఉంటాయి.

 

అప్పట్లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ పేద వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేస్తే దానికి విరుద్ధంగా చంద్రబాబు కార్పొరేట్ బడా బడా ప్రముఖులకు నేతలకు అనుకూలంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవహరించారని కేవలం పేద ప్రజలను ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చంద్రబాబు చూశారని ఎన్టీఆర్ ల పట్టెడన్నం కూడా ఎనాడు చంద్రబాబు పెట్టలేదని… 2014 ఎన్నికల సమయంలో అన్నా క్యాంటీన్లు అని అది చివరాకరికి ఎన్నికల ముందు అన్న క్యాంటీన్ లో పెట్టి చేతులు దులిపేసుకున్నారు అని చంద్రబాబు 10 సంవత్సరాల రాజకీయం గమనిస్తే కేవలం కార్పొరేట్ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించారని చాలామంది ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల మరియు ఆయన వ్యవహరించిన శైలి పట్ల వ్యాఖ్యానిస్తున్నారు.

 

ఇందువల్లనే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్… 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు పట్టించుకోని పేదవాళ్ల ను దృష్టిలో పెట్టుకుని వాళ్ల అవసరాలకు అనుగుణంగా తన మేనిఫెస్టోను రూపొందించి అద్భుతంగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ని చావు దెబ్బ కొట్టే విధంగా చంద్రబాబుకి మతి పోయే విధంగా అధికారంలోకి రావడం జరిగిందని...టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫార్ములా జగన్ ఫాలో అయ్యారని కానీ ఇదే సమయంలో చంద్రబాబు కేవలం కార్పొరేట్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేయడం వల్ల చాలా దెబ్బతినటం జరిగిందని ప్రస్తుతం ఆయన వయసు మరియు పార్టీ పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి స్పష్టంగా ఉందని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: