నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పాలించిన కాలంలో రాజకీయాల్లో సూర్యునిలా వెలిగిపోయాడు. తన రాజకీయ చతురతతో రాష్ట్రరాజకీయాలను తన చెప్పుచేతుల్లో ఉంచుకుని ఏక ధాటిగా ఎదురులేకుండా రెండు రాష్ట్రాలను కూడా పాలించాడు. కాని జీవితంలో ఒక సామేత ఉంది. అదేమంటే ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి. ఇది చంద్రబాబు గారికి అతికినట్లుగా సరిగ్గా సరిపోతుంది.

 

 

ఎందుకంటే 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకుని, అప్పటి నుండి 2004 వ సంవత్సరం వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్‌ మేకర్‌’గా మారాడు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు.

 

 

ఇలా 1000వాట్స్ బలుబులా వెలిగిపోతున్న బాబుగారికి నమ్మిన బంట్లుగా చాలమందే అతని చుట్టుప్రక్కల చేరి భజన చేయడం ప్రారంభించారు.. అంతకు ముందే పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి పదవిని పొందిన ఘనత ఉండటంతో అతని చుట్టుకూడా ఇలాగే అవకాశవాదులు చేరారు. వారంత అవకాశం కోసం కాచుకు కూర్చున్నారు. ఇక మచ్చలేకుండా వెలిగిపోతున్న బాబుగారి పార్టీ ఒక్క సారిగా మసక బారడం మొదలు పెట్టింది.

 

 

అప్పటి నుండి అతని ఉనికే రాజకీయాల్లో ప్రశ్నార్దకంగా మారింది. ఇదిగో ఇప్పుడు బాబును వ‌దిలేసిన వెళ్లిన నేత‌లు కొడాలి నాని, రోజా, త‌మ్మినేని సీతారాం, ఇప్పుడు వీళ్లే ఒక‌రు మంత్రి, మ‌రొక‌రు స్పీక‌ర్‌, మ‌రొక‌రు రోజాటీడీపీ నుంచి వెళ్లి వైసీపీలో కీల‌క నేత‌లుగా ఉన్న వారు. ఇక నమ్మిన వారే నట్టేట ముంచడంతో వీళ్ళు కొట్టిన దెబ్బకు కుదేలు అయిపోయి అర్దం కాని రాజకీయాలు ఇప్పుడు చేస్తున్నారని అనుకుంటున్నారు ప్రజలు..

మరింత సమాచారం తెలుసుకోండి: