తెలుగు వారి ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న ఎన్టీఆర్ గారు,1982లో తెలుగు వారి ఆత్మగౌరవం కోసం మనకంటూ ఒక పార్టీ ఉండాలని, ఇప్పటివరకు తనను సినిమాల్లో ఆదరించిన ప్రజలు, ఇకపై రాజకీయాల్లో కూడా ఆదరిస్తారని ఆసిస్తూ తెలుగు దేశం పేరిట పార్టీని నెలకొల్పారు. పార్టీ పెట్టిన మలి సంవత్సరం జరిగిన ఎన్నికల్లో తొలి విడతే అత్యధిక సీట్లతో భారీ మెజార్టీతో అన్నగారు తెలుగు దేశం పార్టీ తరపున విజయకేతనం ఎగురవేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించారు. అక్కడి నుండి తనవంతుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగిన ఎన్టీఆర్ గారు, ఆ తరువాత కొన్నాళ్ళకు తన అల్లుడైన నారా చంద్రబాబు నాయుడుని అప్పటివరకు కొనసాగుతున్న కాంగ్రెస్ ని వీడి తెలుగు దేశంలోకి ఆహ్వానించడం జరిగింది. 

 

అలా మెల్లగా టిడిపిలోకి ప్రవేశించిన చంద్రబాబు, ఆ తరువాత టిడిపి తరపున 1989లో తొలిసారిగా కుప్పం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్యెల్యేగా గెలిచారు. ఇక అక్కడినుండి మెల్లగా టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలతో చంద్రబాబుకి మరింత అనుబంధం ఏర్పడింది. అనంతరం ఎన్టీఆర్ గారు లక్ష్మి పార్వతిని వివాహం చేసుకోవడం జరిగింది. ఇక అక్కడి నుండి మెల్లగా టిడిపిని తన వైపుకు తిప్పుకోవడం మొదలెట్టిన బాబు గారు, 1995లో ఎన్టీఆర్ ని వ్యతిరేకిస్తూ అప్పటి ఎమ్యెల్యే ల మద్దతుతో ముఖ్యమంత్రిగా తొలిసారి పీఠాన్ని అధిష్టించారు. ఆ తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో కూడా విజయఢంకా మ్రోగించిన చంద్రబాబు, ఇది తన వ్యక్తిగత విజయమని, 

 

ఇక పై ఎన్టీఆర్ బొమ్మ తనకు అవసరం లేదని కొంత అహంకారం ప్రదర్శించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత పలు పార్టీ కార్యమ్రమాల్లో ఎన్టీఆర్ బొమ్మ చాలా చోట్ల తీసేశారు. కాగా అనంతరం 2004 ఎన్నికల్లో టిడిపి, అప్పటి వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయాక, మళ్లీ ఎన్టీఆర్ బొమ్మ  వేసుకోవటం మొదలు పెట్టారు. అయితే చంద్రబాబుకు టిడిపిలో స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్టీఆర్ గారి బొమ్మ లేకుండా ముందుకు వెళ్లడం కుదరదని ఆ ఎన్నికల తరువాత టిడిపికి అర్ధం అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఎన్టీఆర్ గారి బొమ్మను చంద్రబాబు, పలు పార్టీ కార్యక్రమాల్లో వాడుతూ వస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: