నందమురి తారకరామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీ స్థాపించానని చెప్పిన విషయం తెలిసిందే. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం, ఆనాడు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. నందమూరి తారక రామారావు చేతుల్లో నుండి అధికారం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పది సంవత్సరాలు ప్రభుత్వం నిలకడగా ఉంది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో పదేళ్ళు ప్రతిపక్షంలో ఉంది.

 


ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ విడిపోయాక తెలుగు దేశం మళ్ళి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఆ పార్టీలో విభేధాలు వచ్చినప్పటికీ కుటుంబపరమైన విభేధాలు రాలేవనే చెప్పాలి. ప్రస్తుతం ఆ పార్టీలో చీలికలు మొదలయ్యాయి. ఆ చీలికలు కేవలం తన కొడుకు మీద ఉన్న అనురాగం వల్లనే జరిగాయని అంటున్నారు. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపే వారు లోకేషేనని చంద్రబాబు అభిప్రాయ పడుతున్నారు.

 

అయితే ఇక్కడే ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగనుంది. ఎందుకంటే చినబాబు పార్టీని ముందుకు తీసుకెళ్ళగలడనే నమ్మకం చాలా మందిలో లేకపోవడమే దానికి కారణం. చినబాబు తీరు వల్ల సీనియర్ నాయకులు సైతం విసిపోతున్నారట. సుజనా చౌదరి లాంటి సీనియర్ నాయకులు చినబాబు పార్టీ పగ్గాల్ని స్వీకరించడానికి వ్యతిరేకంగా ఉన్నారని సమాచారం. మరి ఈ నేపథ్యంలో పార్టీ భవితవ్యం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.

 

పార్టీ నందమూరి, నారా వర్గాలుగా విడిపోయిందని వినిపిస్తోంది. ఇలా జరగడానికి కారణం చినబాబేనని వాదన. టీడీపీలో చీలికలు రావడానికి చినబాబు గారిపై ఉన్న మమకారం వల్లే అయిందన్నది టీడీపీ సీనియర్ల వాదన. మరి ఈ చీలికలు ఎక్కడిదాకా దారి తీస్తాయో, పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో అనే చర్చ  పార్టీ వర్గాల్లో సీనియర్ నాయకుల్లో విపరీతంగా నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: