తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ ఆనాడు పెద్ద చరిత్రే సృష్టించారు. ఆయన పిలుపుతో ఆకర్షితులైన ఎంతోమంది యువత అప్పట్లో టీడీపీలో చేరారు. వారంతా తర్వాత కాలంలో సీనియర్ నాయకులయ్యారు. ఉన్నత పదవులు అధిరోహించారు. ఆయన హయాంలోనే అల్లుడి హోదాలో చంద్రబాబును పార్టీలోకి తీసుకొచ్చారు. యువతే దేశానికి వెన్నెముక అనే నానుడిని ఎన్టీఆర్ పాటించినంతగా తర్వాత కాలంలో టీడీపీకి నాయకత్వం వహించిన చంద్రబాబు పాటించలేదనేది వాస్తవం.

 

 

చంద్రబాబు సీఎంగా అధికారంలో ఉన్న మొదటి తొమ్మిదేళ్లలో కూడా అప్పటివరకూ సంస్థాగతంగా టీడీపీలో ఉన్న వారినే ప్రోత్సహించారు గానీ యువ నాయకత్వం వైపు చూడలేదు. అప్పట్లో అధికారం ఉంది కాబట్టి పట్టించుకోకపోయినా పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న సమయంలో కూడా ఆ ఆలోచన చేయలేదు. తిరిగి 2014లో అధికారంలోకి రావడం.. పాత తరం నాయకులతోనే వెళ్లారు గానీ యువతను కన్నెత్తి చూడలేదు. వారిని పార్టీ ప్రయోజనాలకు వాడుకున్నారే గానీ వారిలో భవిష్యత్ నాయకులను చూడలేదు. తమను పట్టించుకోవాలని వారు కోరినప్పుడల్లా తనయుడు లోకేశ్ ను ప్రయోగించి వారిని మభ్యపెట్టడం తప్ప బాబు చేసిందేమీ లేదు. ఈ విషయం బహిరంగంగానే తెలిసినా లోకేశ్ యువ నాయకత్వం నచ్చకపోయినా వారంతా ముందుకు నడిచారు. పాత తరం నాయకులతో వెళ్లడం ప్రజలకు నచ్చడం లేదు.

 

 

గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం పార్టీకి యువ నాయకత్వం ఎంత అవసరమో బాబుకు తెలిసొచ్చింది. ఎన్నికలకు ముందే తమ పునాదులు కాదులుతున్నాయని భావించిన బాబు ఇకపై పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. కానీ అప్పటికే కాలాతీతం అయిపోయింది. ఇప్పుడు సమీక్షలు పెట్టి యువతకు పెద్ద పీట వేస్తామంటే బాబు మాటలు ఎలా నమ్మాలి అనే వాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజలకు కూడా టీడీపీలో పాత తరం నాయకులను చూసి కూడా నమ్మకం పోతోందనేది నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: