తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు.  తెలంగాణ కోసం పోరాటం జరిపిన ప్రతి ఒక్కరికీ బంగారు తెలంగాణ అందించడమే తన లక్ష్యమని చెప్పారు.  ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.  డబుల్ బెడ్ రూమ్ పథకం, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇలా తెలంగాణ ప్రజలు కన్న కలలు నెరవేర్చుతున్నారు.  కేసీఆర్ అభివృద్ది పనులు చేస్తూ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మరోసారి ఆయనకే పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు.  అయితే ఈ మద్య టీఎస్ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వర్థామ రెడ్డి ఆధ్వర్యంలో 50 రోజుల వరకు నిరవదిక సమ్మే చేశారు.  ఇదే సమయంలో ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఉద్యోగంలో చేరాలని అవకాశం ఇచ్చారు.. కానీ వారు ససేమిరా అన్నారు.  దాంతో ఈ వ్యవహారం కోర్టు కు వెళ్లింది.. ఎన్నో చర్చలు.. గొడవలు జరిగాయి.

 

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలన్న వారి డిమాండ్ కేసీఆర్ ససేమిరా అన్నారు.  మొత్తానికి 50 గడిచిన తర్వాత ఆర్టీసీ కార్మికులు కాంప్రమైజ్ కావడం.. సమ్మె విరమణ చేయడం జరిగింది.  ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న ఆర్టీసీ ఉద్యోగులు కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఆర్టీసీ అభివృద్ధితో పాటూ పలు కీలక అంశాలపై వారితో చర్చించారు.. ఉద్యోగులతో తెలంగాణ సీఎం నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ఆ సమయంలో పలు హామీలు ఇచ్చారు... తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.  సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త చెప్పారు. ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది.

 

తాజా ఉత్తర్వులతో ఇకపై ఆర్టీసీ కార్మికులు బదులు.. ఆర్టీసీ ఉద్యోగులు అని పిలవాల్సి ఉంటుంది. అంతేకాదు అధికారిక కమ్యూనికేషన్‌లో పేర్కొనాలని సర్క్యులర్‌లో క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ప్రైవేట్ సర్వీసులకు అనుమతి ఇచ్చేది లేదన్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆర్టీసీ ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: