తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రెస్ మీట్లలో కానీ, బహిరంగ సభల్లో కానీ తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెబుతూ ఇతర పార్టీలపై, నాయకులపై విమర్శలు చేస్తారు. కానీ గడచిన 10 సంవత్సరాల్లో చంద్రబాబు కంటే అనుభవంలో జూనియర్ అయిన 46 సంవత్సరాల వయస్సు గల జగన్ చంద్రబాబుకు చుక్కలు చూపించారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చారు.
 
కానీ జగన్ మాత్రం రుణమాఫీ హామీ అమలు సాధ్యం కాదని అమలు చేయలేని హామీలను ఇవ్వనని చెప్పారు. చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మిన జనం 2014 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ అవినీతిని, తెలుగుదేశం ప్రభుత్వం హామీలను అమలు చేస్తున్న తీరును రాజధాని పేరుతో ప్రజలను చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో ప్రజలకు వివరించారు. 
 
చంద్రబాబు వైఫల్యాలను ఎత్తి చూపుతూ జగన్ విమర్శలు చేశారు. తండ్రి మరణం తరువాత ఢిల్లీ నుండి గల్లీ వరకు తనకు ఉన్న ప్రత్యర్థులకు జగన్ 2019 ఎన్నికల ఫలితాలతో సమాధానం చెప్పారు. 2014 ఎన్నికల ముందు టీడీపీ జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడని జగన్ పై ఆరోపణలు చేసింది. జగన్ పార్టీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేరేలా చేసింది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో భారీ స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టి నైతికంగా జగన్ నుదెబ్బ తీసింది. 
 
కానీ జగన్ పాదయాత్రను ప్రారంభించి ప్రజలతో మమేకమై ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ, చంద్రబాబు పాలనా వైఫల్యాలను ప్రజలను తెలియజేస్తూ అధికారంలోకి వచ్చారు. ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు కలలో కూడా ఊహించని సీట్లను సాధించి జగన్ చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని ప్రజల కళ్ల ముందు ఉంచుతున్నారు. రివర్స్ టెండరింగ్ తో తెలుగుదేశం పాలనలో జరిగిన అవినీతిని ప్రజలకు తెలియజేస్తున్నారు. రాజధానిలో భూముల కొనుగోలులో జరిగిన అక్రమాలు, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అక్రమాల గురించి వెలుగులోకి తెస్తున్నారు. 
 
తొలి కేబినేట్ సమావేశంలోనే జగన్ అన్ని వర్గాలకు చేరువయ్యే నిర్ణయాలను తీసుకోవడం ఆ నిర్ణయాలకు కేబినేట్ ఆమోదం తెలపడంతో జగన్ ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. జగన్ పరిపాలన చూసిన ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందా...? అనే ప్రశ్న మెదులుతోంది. 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుపై అమరావతి పర్యటనలో రైతులు చెప్పులు, కర్రలతో దాడి చేశారంటే చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం,అదే సమయంలో175 సీట్లలో 151 సీట్లతో అధికారం ఇచ్చారంటే జగన్ పై ప్రజల్లో ఉన్న అభిమానం తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: