వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రతిపక్షాల పై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తు  ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా  కౌంటర్ ఇస్తుందన్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి టిడిపి అధినేత చంద్రబాబు పై కౌంటర్ ఇస్తూ నోరు జారింది నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా. ప్రస్తుతం రోజా నోట జారిన ఆ  మాట  వైరల్  అయిపోతుంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీలో మద్యపాన నిషేధం పై చర్చ జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో రోజా ప్రతిపక్ష టిడిపి పై విరుచుకు పడ్డారు. 

 

 

 

 అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు గుప్పించారు రోజ. ఒకప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారని.. కాని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ నిషేధాన్ని తొలగించారని ఇలాంటి ఘనత కేవలం  చంద్రబాబు కు మాత్రమే దక్కిందని  విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తుంటే సమర్పించాల్సింది  పోయి విమర్శలు చేయడం ఒక చంద్రబాబుకే చెల్లిందని రోజా విమర్శించారు. కాగా మద్యం పై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో మాట్లాడేందుకు ముఖం లేకనే అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి పారిపోయారు అంటూ వ్యాఖ్యానించారు. 

 

 

 

 చంద్రబాబును విమర్శించే సమయంలో మాజీ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించపోయి పొరపాటున ముఖ్యమంత్రి అసెంబ్లీ నుండి పారిపోయారు అని  నోరు జారారు  ఎమ్మెల్యే రోజు. దీంతో వెంటనే తన తప్పును తెలుసుకున్న రోజా... సారీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు పారిపోయారు అంటూ ప్రసంగాన్ని కొనసాగించింది. ప్రస్తుతం రోజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా గతంలో టిడిపి ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందని..  దీంతో ఎంతో మంది స్త్రీలు రోడ్డున పడ్డారు అంటూ చెప్పుకొచ్చారు రోజా . మద్యం ఏరులై పారడంతో ఎంతో మంది మద్యానికి బానిసై రోడ్డున పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: