1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత తొమ్మిది నెలల కాలంలోనే ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకొచ్చారు.  కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు ప్రజలు అప్పటికే విసిగిపోయారు.  నాయకులంటే ఎన్నికలకు ముందు మాత్రమే కనిపించేవారు.  అరచేతిలో వైకుంఠం చూపించి ఓటు వేయించుకొని వెళ్ళిపోయేవారు.  ఎమ్మెల్యేలు ఎప్పుడో కనిపించేవారు.  ఇక ఎంపీలైతే అసలు కనిపించేవారు కాదు.  రాజకీయాలంటే ఇలా ఉంటాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ చూపించింది.  


సామాన్యులకు సైతం రాజకీయాలను పరిచయం చేసింది. ఇలా రాజకీయాలు సామాన్యులకు చేరువ చేయడంలో తెలుగుదేశం పార్టీ సఫలం అయ్యింది.  ఎన్టీఆర్ తరువాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని టేకోవర్ చేసుకున్నారు.  చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు.  2009 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలల్లో ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం పార్టీ భావించింది.  అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు.  


ఎన్నికల సమయంలో సినిమా రంగంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది.  ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించేందుకు ఆ బాధ్యతలు అప్పగించింది.  అప్పగించిన బాధ్యతను ఎన్టీఆర్ సక్రమంగా పూర్తి చేశారు.  ఎన్టీఆర్ స్పీచ్ కు ప్రజలు బ్రహ్మరధం పట్టారు.  దీంతో బాబు తరువాత తెలుగుదేశం పార్టీని లీడ్ చేసే సత్తా ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని, ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం పార్టీని లీడ్ చేయగలరని తెలుగుదేశం పార్టీనేతలు అనుకున్నారు.  


దీంతో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపోరు మొదలైంది.  క్రమంగా ఎన్టీఆర్ ను కావాలని దూరం పెట్టారు.  ఎన్టీఆర్ పై లోకేష్ విమర్శలు చేయడం మొదలుపెట్టారు.  ఉద్దేశ్యపూర్వకంగానే ఎన్టీఆర్ ను దూరం పెట్టారు.  అలానే అటు హరికృష్ణను కూడా దూరంగా పెట్టడం... ఆ తరువాత హరికృష్ణ మరణించడంతో ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలకే పరిమితం కావాలని అనుకున్నారు.  రాజకీయాల గురించి ఇప్పుడు పట్టించుకోవడం లేదు.  లోకేష్ అభద్రతా భావం కారణంగానే ఎన్టీఆర్ ను దూరం పెట్టింది.  ఎన్టీఆర్ ను దూరం పెట్టినంత మాత్రానా టీడీపీ తిరిగి విజయం సాధిస్తుందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి.  టీడీపీకి ఇప్పుడు ఛరిష్మా కావాలి.  అది లోకేష్ దగ్గర లేదు.  ఎన్టీఆర్ దగ్గర మాత్రమే ఉన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: