తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటివరకు రాజకీయాల్లో 40 ఏళ్లు సక్సెస్ ఫుల్లుగా రాణించారు అంటే దానికి ప్రధాన కారణం ఒకటి ఆయన చెప్పే అబద్ధాలు మరొకటి చంద్రబాబుకు అనుకూలంగా ఉండే మీడియా అని ఆయన ప్రత్యర్థి రాజకీయ నేతలు అంటుంటారు. చంద్రబాబు తన అంటే అనుకూల వర్గం మీడియా తందానా అంటుందని అందువల్లనే ఆయన రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు రాణించడం జరిగిందని  ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే గత పది సంవత్సరాలలో 2014  వ సంవత్సరం వరకు మీడియాను మేనేజ్ చేస్తూ విభజనతో మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఆ టైంలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు దాదాపు ఆరువందలకు పైగా హామీలు ఇవ్వడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల విషయంలో నిర్లక్ష్యం వహించి ఇష్టానుసారం అయిన రాజకీయాలు చేయటంతో ఒక్కసారిగా ప్రజలలోనుండి తీవ్ర వ్యతిరేకత అతికొద్ది సమయంలోనే రావడంతో మీడియాను మేనేజ్ చేద్దాం అని భావించిన చంద్రబాబుకి సోషల్ మీడియా రూపంలో ఎదురు దెబ్బ తగిలింది.

 

మీడియాలో ఒక వర్గం చంద్రబాబు కి అనుకూలంగా ఉందన్న ముద్ర రాష్ట్ర ప్రజల్లో నాటుకుపోయింది. దీంతో సదరు మీడియా చానల్ కి సంబంధించిన వార్తల విషయంలో చంద్రబాబుకు అనుకూలంగా ఎన్ని వార్తలు వడి వారించిన ప్రజలు మాత్రం వాటిని నమ్మలేదు. అయితే ఒక సారి తెలుగుదేశం పార్టీ పరిస్థితిని స్టార్టింగ్ నుండి గమనిస్తే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మీడియాను మేనేజ్ చేయ‌డంలో అస్స‌లు ప‌ట్టించుకునే వారు కాదు.. కాని బాబు అంతా మీడియా మేనేజ‌ర్‌.. మీడియాను ఎలా మేనేజ్ చేయాలో అన్న దానిపైన ఫోకస్ అన్నట్టుగా వ్యవహరించేవారు. 

 

ఇదే సందర్భంలో బాబు హయాంలో ఆయన అనుకూల మీడియా అతిగా ప్రవర్తించడంతో ...సామాన్య ప్రజలు సోషల్ మీడియా ద్వారా అసలు నిజాలు తెలుసుకుని 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి వచ్చేటట్లు తీర్పు ఇచ్చారు. మొత్తంమీద చూసుకుంటే మీడియాని మేనేజ్ చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన చంద్రబాబు కి సోషల్ మీడియా ద్వారా అసలు నిజాలు తెలుసుకుని సామాన్య ప్రజలు కోలుకోలేని తీర్పు 2019 ఎన్నికల్లో ఇచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: