దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన అనంతరం ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు నడపాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని స్థాపించారు. కాగా  2011 సంవత్సరంలో వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించబడింది. అప్పటికి టిడిపి అధినేత చంద్రబాబు రాజకీయాల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నేత. అప్పటికే  ముఖ్యమంత్రిగా పని చేశారు కూడా. కానీ తెరమీదికి వైసిపి పార్టీ రావడంతో బాబోరికి  టెన్షన్ మొదలైంది. బాబుగారి మాస్టర్ మైండ్ బుర్రకి అప్పుడే అర్థమైపోయి ఉంటుంది. వైసీపీ పార్టీలో తనకు ఇబ్బందులు తప్పవని. ఇటు వైసీపీ పార్టీ తెరమీదికి వచ్చినప్పటి నుంచే బాబు వైసిపి పార్టీని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనసేన మద్దతు కూడగట్టుకుని బాబోరు  అధికారంలోకి వచ్చారు. 

 

 

 

 కాగా వైసీపీ పార్టీ కూడా చాలా అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన పెద్ద బాబోరు  ప్రతిపక్ష వైసీపీపై మాత్రం కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఆయనను శతవిధాలా బాబు ఇబ్బందులకు గురిచేశారు. అక్రమాస్తుల కేసులు బనాయించడం సహా.. వైసీపీ ఎమ్మెల్యేలు చాలామందిని  తమ  వైపు తిప్పుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు ప్రస్తుత ప్రతిపక్ష నేత గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వైసిపి పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఉన్న ఒకే ఒక్క దిక్కు మొక్కు టిడిపి పార్టీ అన్నట్లుగా మార్చడానికి బాబోరు  శత విధాలుగా ప్రయత్నాలు చేశారు. వైసిపి పార్టీని కనుమరుగయ్యేలా  చేసేందుకు ఎలాంటి పనులు  చేయడానికైనా వెనకాడలేదు పెద్దబాబోరు . 

 

 

 

 కానీ వైసీపీని భూస్థాపితం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న చర్యలు అన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాకుండా చంద్రబాబు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి దిగజారిపోయిన ఆంధ్రప్రదేశ్ పాలనను  ప్రజలు గమనించారు. బాబు వస్తే జాబు వస్తుంది అని నమ్మిన ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు చంద్రబాబు. క్రమక్రమంగా ఐదేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో టీడీపీ పార్టీపై అధినేత చంద్రబాబుపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత మొదలైంది. దీంతో 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ కి భారీ మెజారిటీ కట్టబెట్టి.. గతంలో టీడీపీ  అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించిన చంద్రబాబుకు చివరికి ఆ 23 అసెంబ్లీ స్థానాలను కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.దీంతో  వైసీపీని భూస్థాపితం చేద్దాం అనుకున్న బాబోరికి..  23 సీట్లు ఇచ్చి టిడిపిని  బొంద పెట్టినంత పని చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: