వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ సాక్షిగా 2017 నవంబర్‌ 6 న ఒక చరిత్ర పురుడు పోసుకుంది. బాధ్యతా రహిత పాలన వల్ల కష్టాల్లో ఉన్న ప్రజలకు ఓ నమ్మకం, ఓ ధైర్యం, ఓ భరోసా ఇవ్వాలనే ప్రజా సంకల్పంతో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టారు. ప్రజల చెంతకే నడుచుకుంటూ వెళ్లాడు. రుతువులు మారాయి. క్యాలెండర్‌ పేజీలు మారాయి. పాదయాత్రికుడైన వైయస్‌ జగన్‌ జనం మనిషై పోయాడు. చీకటిలో వెలుగు కావాలనుకుంటాం.

 

 

నిరాశలో ఆశగా ఒక భరోసా కోసం ఎదురుచూస్తాం.  నిన్నా, మొన్నటి దాకా ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉంది. అప్పుడో పాదయాత్రికుడు వెలుగు దివ్వెగా మారాడు. భరోసాగా ప్రజల కోసం నడిచాడు. నాటి వైయస్‌ఆర్‌ పాదయాత్ర ఫలితాలు ఆయన పాలన కాలంలో ప్రతిఫలించాయి. అప్పటి దాకా విశాలాంధ్రకు అనుభవం లేని అద్భుతమైన సుపరిపాలన సాగింది. సంక్షేమం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లితే, అభివృద్ధి పరుగులు పెట్టింది.

 

 

అప్పుడు రాష్ట్రం దేశానికే దిక్సూచి.  2019లో జరిగిన సార్వాత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఏకంగా 151 నియోజక వర్గాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా రెపరెప లాడింది. అఖండ మెజారిటీతో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా దాదాపు 5 నెలల్లోనే 80 శాతం అమలు చేసి దేశానికే దిక్కూచిలా  నిలిచారు.

 

 

ఇక అప్పటి వరకు ప్రజాస్వామ్యం కాదని చంద్రబాబు అడ్డ గోలుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. జగన్ రాకతో టీడీపి పాలనకు, ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. క్రమక్రమంగా తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతూ ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకు బాబు అవినీతిని బట్టబయలు చేసిన జగన్ కనీసం చంద్రబాబుని ఊపిరి కూడా తీసుకోనంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తూనే తన పాలనలో సరికొత్తగా ఏపీ ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నాడు.. ఒక రకంగా ఇన్నాళ్లూ 40 ఇయర్స్ రాజకీయ అనుభవంలో చంద్రబాబు ఇలాంటి పరిస్దితిని ఎప్పుడు ఎదుర్కో లేదనిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: