ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ఈరోజు తన 45వ పుట్టినరోజు జరుపుకుంటుంది. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన షర్మిల 1974 డిసెంబర్ 17వ తారీఖున జన్మించింది. ఆమెకు భర్త అనిల్ కుమార్ కాగా, కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి రెడ్డి.

https://mobile.twitter.com/KadaliTuasi/status/1206771209053933570

అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ తో పాటు తనదైన శైలిలో ప్రచారం చేసి ప్రజలందరినీ ఎంతో ఆకట్టుకున్నారు. బాయ్ బాయ్ బాబు, ఇదే మన ప్రజాతీర్పు కావాలి బాయ్ బాయ్ అంటూ సమస్త ఆంధ్రప్రదేశ్ ప్రజలను తన వాక్చాతుర్యంతో కట్టిపడేసారు. వాస్తవానికి, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ షర్మిల కీలకమైన పాత్ర వహించారు. అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి జైలు లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ప్రజల ఆశీస్సులు పొందారు. జగన్ ముఖ్యమంత్రి కావడానికి ముందు 10 ఏళ్లు ఎన్నో ఒడిదుడుకులను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు.



ఆ సమయంలో జగన్ వెన్నుతట్టి ముందుకు నడిపించింది ముఖ్యంగా తన సోదరి షర్మిల మాత్రమే. తల్లి విజయమ్మ, భార్య భారతి కూడా జగన్ ను బాగా ప్రోత్సహించారు.


ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా.. 'నాన్న ఆశయాల కోసం అన్న కి అండగా ఉన్న.. షర్మిల అక్క కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా విష్ చేస్తున్నారు.

https://mobile.twitter.com/RojaSelvamaniRK/status/1206801863934263296

ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా షర్మిలకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు విషెస్ తెలిపారు. వై ఎస్ షర్మిల తో పాదయాత్రలో వెంట రోజా నడిచిన ఒక ఫోటో ని కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు విషెస్ కు జత చేశారు.


నెటిజన్లు చిన్ననాటి పుట్టినరోజు శుభాకాంక్షలు వేడుకలలో విజయమ్మ షర్మిలకు కేకు తినిపిస్తున్న ఫోటో షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

https://mobile.twitter.com/ManviDad/status/1206804099456352257

'మహిళా అనే పదానికి నిజమైన నిర్వచనం మన షర్మిల గారు, తండ్రి గారాలపట్టి మాత్రమే కాదు , ఆయన ఆశయసాధనను పుణికిపుచ్చుకుందామె.
అన్నకు తోడుగా నడిచింది. ప్రజల కోసం నిలబడింది. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న వైయస్ షర్మిల గారికి జన్మదిన శుభాకాంక్షలు.' అని ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

https://mobile.twitter.com/taruns_/status/1206837110709223425

మరింత సమాచారం తెలుసుకోండి: