టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా 1995 లో ఏపీకి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించడం జరిగింది. అప్పటివరకు సీనియర్ నాయకులు ఎన్టీఆర్ గారి నేతృత్వంలో కొనసాగిన పార్టీని, మెల్లగా బాబు ఒక్కొక్క నేత మరియు కార్యకర్తను తనవైపుకు త్రిప్పుకొని వారి మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడినుండి రెండు సార్లు ఉమ్మడి ఏపీకి మరియు ఇటీవల విడిపోయిన తరువాత నవ్యంధ్రప్రదేశ్ కు కూడా 2014లో ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. మొత్తం తన రాజకీయ జీవితంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు గారి నేతృత్వంలో ప్రజలు ఎంతవరకు సంక్షేమం చూసారు అనే విషయం అటుంచితే, 

 

ఇటీవల నవ్యంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తారని భావన కొందరు ప్రజల్లో కలిగినట్లు అప్పట్లో వార్తలు ప్రచారం అయ్యాయి. అదీకాక 2014 ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయమై ప్రజలకు హామీ ఇచ్చిన బాబు, వాటిని కేంద్రం మెడలు వంచి సాధించడంలో పూర్తిగా విఫలం అవ్వడంతో, ప్రజలు ఎంతో ఆగ్రహంతో మొన్నటి ఎన్నికల్లో టిడిపిలోకి కేవలం 23 సీట్లు మాత్రమే కట్టబెట్టి, ఘోర పరాజయాన్ని అందించారు. తెలంగాణ‌లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ‌గొట్టి, అభివృద్ధిని హైద‌రాబాద్‌లో కేంద్రీక‌ర‌ణ చేయ‌డంతోనే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగింది. 

 

అధికారాన్ని చేపట్టిన తరువాత బాబు అమ‌రావ‌తిలోనే అభివృద్ధిని కేంద్రీక‌ర‌ణ చేయడంతో, ఏపీ ప్ర‌జ‌లు మ‌ళ్లీ బాబును గెలిస్తే ఇక మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెంద‌వు అని భ‌య‌ప‌డ్డట్లు తెలుస్తోంది. అలానే ఆ అమరావతిని, అక్క‌డ పంట భూముల‌ను నాశ‌నం చేయడంతో పాటు, దొన‌కొండ‌లో అట‌వీ భూములు ఉన్నా త‌న కులాభిమానం కోసం ఇలా చేశార‌ని భావించారు. అందుకే ఉత్త‌రాంధ్ర‌, సీమ‌లో బాబోరి పార్టీకి చిత్తు చిత్తుగా ఓడించారు. ఎందుకంటే వెన‌క‌ప‌డిన ఆ రెండు ప్రాంతాల‌ను బాబోరు ఎంత మాత్రం ప‌ట్టించుకోలేదనే వాదన ఆ సమయంలో గట్టిగా వినపడింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: