ఈ మధ్య  తాగడం తూగడం కామన్ అయిపోయింది. ఏ చిన్న ఫంక్షన్  అయినా ఇప్పుడు తాగడం మాత్రం కామాన్. అయితే తాగేటప్పుడు కిక్కులో  అంత బాగానే ఉంటుంది కానీ తాగిన తర్వాత మాత్రం ఆ పొద్దున్నే ఆఫీసు కు వెళ్లాలంటే తాగింది దిగక..  లీవ్ దొరక్క  ఒక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక రాత్రంతా ఫుల్గా తాగి ఉదయాన్నే లేచి ఉద్యోగానికి వెళ్ళాలి అంటే  అబ్బో ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే నైట్ అంతా పొద్దుటి ఉద్యోగం గురించి ఆలోచించకుండా ఫుల్లుగా తాగేస్తుంటారు . ఇక ఇంకేముంది పొద్దున వారికి నైట్ తాగింది పొద్దున్న వరకు దిగలేదే అనుకోండి .. ఇక  ఆఫీసుకు వెళ్లాలనే ఆలోచన వస్తేనే అమ్మో ఆఫీస్ కి వెళ్లాలి కదా అనేంతగా  భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

 

 

 

 ఇలాంటి సమస్య ప్రతి ఉద్యోగికి ఏదో ఒక సమయంలో ఎదురవుతూనే ఉంటుంది. పార్టీలు పబ్బులు  అంటూ గట్టిగా తాగడం... పొద్దున్నే లేచి జాబ్ కి వెళ్లడానికి తంటాలు పడటం. కానీ ఇక్కడ ఉద్యోగులకు మాత్రం ఇలాంటి కష్టం లేదు సుమి.నైట్ గట్టిగా తాగారంటే  ఆ తర్వాత రోజు.. ఇక ఆ తర్వాత రోజు ఉదయం తాగింది దిగక పోతే సాఫీగా సెలవు తీసుకోవచ్చు.  ఒక్క రోజు మొత్తం రెస్ట్ తీసుకోవడానికి వీలు ఇక్కడ ఉద్యోగులకి ఉంది. అబ్బా ఇలాంటి సెలవులు  కూడా ఇస్తారా అని  నమ్మలేకపోతున్నారు కదా. కానీ ఇది ముమ్మాటికి నిజమే. అయితే ఇది మన దేశంలో కాదండోయ్. ఇంగ్లాండ్ దేశంలో. 

 

 

 

అక్కడ ఉద్యోగులు  నైట్ ఫుల్ గా తాగారే  అనుకోండి.. ఇక మార్నింగ్ అది దిగకపోతే సాఫీగా  లీవ్  తీసుకొని రెస్ట్ తీసుకోవచ్చు. ఇంగ్లాండ్ లోని ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ.. హాంగ్ ఓవర్ డే  పేరుతో ఓ వినూత్న సెలవును  ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా రాత్రి ఫుల్లుగా తాగేసి.. ఉదయానికి కూడా మద్దతు దిగకుండా ఇబ్బంది పడుతున్న వారు హ్యాంగోవర్  డే సెలవుని  ఉపయోగించుకోవచ్చు. మరి ఆ సంస్థలో పని చేసే మందు తాగని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారా... వారికి కూడా ఈ సెలవు అందుబాటులోనే ఉంటుంది. ఏదైనా వివిధ  కారణాల వల్ల రాత్రంతా నిద్రపోకుండా ఉండి ఉదయాన్నే నిద్ర లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు... వారు కూడా ఈ సెలవును వాడుకోవడానికి వీలు కల్పించింది ఆ సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: