ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలకు  చెందిన ఆరు మంది రాజ్యసభ సభ్యులు వచ్చే ఏడాది ఏప్రిల్ లో పదవి విరమణ చేయనున్నారు . ఆంధ్ర ప్రదేశ్ నుంచి నల్గురు , తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనున్న నేపధ్యం లో వారి స్థానాల్లో కొత్తవారిని ఎవర్ని నామినేట్ చేస్తారన్న దానిపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్ గా మారింది . తెలంగాణ లో టీడీపీ నుంచి రాజ్యసభ కు నామినేట్ అయి , ప్రస్తుతం బీజేపీ లో కొనసాగుతున్న గరికపాటి మోహన్ రావు , కాంగ్రెస్ కు చెందిన కేవీపీ రామచంద్రరావు లు పదవి విరమణ చేయనున్నారు .

 

ఇక విభజన లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించిన టీఆరెస్ రాజ్యసభ పక్ష నేత కేశవరావు , కాంగ్రెస్ కు చెందిన  మహమ్మద్ అలీ ఖాన్ , టి . సుబ్బరామిరెడ్డి తో పాటు టీడీపీ కి చెందిన తోట సీతారామలక్ష్మిలు పదవి విరమణ చేయనున్నారు . ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగు స్థానాలు ఖాళీ కానుండడం తో  రాజ్యసభ లో అధికార  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని మరింత పెంచుకునే అవకాశాలున్నాయి . ఇక తెలంగాణాలో టీఆరెస్ ఖాతాలోకి రెండింటికీ, రెండు  స్థానాలు వెళ్లనున్నాయి . దీనితో అభ్యర్థుల ఎంపిక పై టీఆరెస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది .

 

రెండు స్థానాల్లో ఒకటి బిసిలకు లేదా దళితులకు ఇచ్చే అవకాశముందని , మరొకటి రెడ్డి లేదంటే వెల్మ సామాజికవర్గానికి చెందిన నేతలకు కట్టబెట్టవచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి . బిసి కోటాలో కేశవరావుకు మరొక్కసారి అవకాశం దక్కవచ్చునని, వెల్మ సామాజిక వర్గానికి చెందిన  వినోద్ రావు కు లేదంటే కవితకు రాజ్యసభస్థానం దక్కే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: