దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా తయారైంది. 1982లో పార్టీ ఏర్పాటు తర్వాత ఎన్నడూ ఎదురుకానంత ఘోర పరాభవాన్ని టీడీపీ వైఎస్ ఫ్యామిలీ చేతిలో చవి చూసింది. ఇప్పుడు అతి పెద్ద సమస్య చంద్రబాబు ముందు ఉంది. జగన్ కూడా కేసీఆర్ తరహా వ్యూహం అవలంబిస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆలోచింపజేస్తున్న ప్రశ్న..

 

 

 తెలుగుదేశం పార్టీ ఏర్పడిన 1982 మార్చ్ 29 నాటి నుండి ఇప్పటి వరకు ఐదుసార్లు విజయం సాధించిన టీడీపీ.. నాలుగు సార్లు ఓటమి పాలైంది. 1989లో తొలిసారి ఓడిన టీడీపీకి అప్పట్లో 90 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో మరోమారు ఓటమి పాలైంది. అప్పుడు 47 సీట్లు మాత్రమే వచ్చాయి. 2009లో ఓడినా 90 సీట్లు వచ్చాయి. అప్పుడు రాష్ట్రం ఉమ్మడిగా ఉంది.ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీకి జగన్ చేతిలో తొలి ఓటమి. దాని ఫలితంగా ఇప్పుడు కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

 

 

ఇప్పటి వరకు టీడీపీ చరిత్రలోనే ఇంత ఘోర పరాజయం ఎప్పుడు ఎదురు కాలేదు. ఇకపోతే ఒక పక్క బీజేపీ సర్కార్ స్పష్టమైన మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి రాగా, మరో పక్క ఏపీలోనూ ఏకపక్షంగా వీచిన ఫ్యాన్ గాలి చంద్రబాబును ఇరకాటంలో పెట్టనున్నాయి. ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి బీజేపీయేతర కూటమి ద్వారా దేశంలో అధికారం సాధించాలని ప్రయత్నాలు చేసిన చంద్రబాబుపై బీజేపీ ఇప్పటికే ఆగ్రహంతో ఉంది.

 

 

ఇక ఇంత కాలం ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ చంద్రబాబు హయాంలో పడిన ఇబ్బందుల నేపధ్యంలో ఇప్పుడు అధికారం లోకి వచ్చి వైసీపీ  ప్రభుత్వం చంద్రబాబును మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ, ముప్పతిప్పలు పెడుతుంది. ఇకపోతే ఒకపక్క మోడీతో, మరో పక్క కేసీఆర్ తో, ఏపీలోని ప్రత్యర్ధి పార్టీతో విరోధం పెంచుకున్న చంద్రబాబు ఇప్పుడు అధికారం లేకుండా ఎలా గట్టెక్కుతారో.. టీడీపీని ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలనుకుంటున్నారు ఏపీ ప్రజలు. ఇక మొదట బాబు అరాచక పాలనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునాది వేయగా ఇప్పుడు జగన్ చరమ గీతం పాడారని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: